12, జులై 2020, ఆదివారం

తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి నిర్మలమ్మ బయోగ్రఫీ తెలుసుకుందామా

తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి నిర్మలమ్మ బయోగ్రఫీ తెలుసుకుందామా

ప్రముఖ సినీనటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.

నిర్మలమ్మ స్వస్థలం:

  • నిర్మలమ్మ అసలుపేరు రాజమణి. ఈమె 1927 సంవత్సరంలో కృష్ణ జిల్లా , మచిలీ పట్నం (బందరు) లో జన్మించారు.

  • నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావు తో వివాహం జరిగింది.

  • స్టేజ్ ఆర్టిస్ట్ , ప్రజానాట్యమండలి లో వుండేవారు , తరువాత పద్మాలయ స్టూడియోసులోనూ, అటుపిమ్మట దాసరినారాయణరావు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా వుండేవారు.

  • వీరికి సంతానం కలుగలేదు కావున దత్తత చేసుకున్నారు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్. కవిత భర్త కుడా సినీ నిర్మాత .

నిర్మలమ్మ నటనా జీవితం:

  • నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. 
  • 1950 లో తన 16 వ ఏట "గరుడ గర్వభంగము "సినిమా తో తనసినిమా కెరీర్ ని ప్రారంభించి సుమారు 800 సినిమాల లో నటించారు . 

  • తెలుగు  సినిమా తెలుగింటి బామ్మ గా పేరు పొందేరు . 
  • తల్లిగా, బామ్మగా అనేక చిత్రాలలో నటించారు. ప్రముఖ హీరోలందరికి, హీరోయిన్లకి బామ్మగా జీవిస్తూ అందరికీ ఆత్మీయురాలిగా అందరి మనసులలో నిలిచారు.

  • సినిమాలలోనే కాదు షూటింగం సమయంలో సెట్లో ఉన్న వారందరికీ కూడా ఆమె బామ్మే!
  • తనకన్నా పెద్దవారైన నాటి ఎన్.టీ రామారావు‌, అక్కినేని, యస్వీఆర్ ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. 

  • మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది, అవార్డులను అందుకున్నారు.
  • శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఎంతో  ఓపికతో నటించింది 

  • ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. 

  • ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంకు ఒప్పించాడు.


ప్రముఖుల అభిప్రాయాలు:
  • కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సంధర్భాల్లో గుర్తు చేసుకునేది.
  • షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు

  • నిర్మలమ్మ ఆడపెత్తనం లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. 
  • ఆ తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. 

  • ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. 
  • అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.

  • ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
  • నిర్మలమ్మ గారి ఆఖరి సినిమా స్నేహం కోసం (1999).

  • నిర్మలమ్మ గారు 19 ఫిబ్రవరి 2009 తన 82వ ఏట హైదరాబాద్ లోని తన స్వగృహములో మరణించారు.

నిర్మలమ్మ గారి కి వచ్చిన అవార్ద్స్:

నంది అవార్డు, ఫ్హిలింఫేర్ అవార్డు, మరియు సితారా అవార్డులను అందుకొన్నారు.

ఈమె నటించిన కొన్ని చిత్రాల వివరాలు

  • స్నేహం కోసం (1999)

  • రాయుడు (1998)

  • మావిచిగురు (1996)

  • బిగ్ బాస్ (1995)

  • శుభ సంకల్పం (1995)

  • ఆలీబాబా అరడజను దొంగలు (1994)

  • ఆ ఒక్కటి అడక్కు (1993)

  • మాయలోడు (1993)

  • ఆపద్బాంధవుడు (1992)

  • సుందరకాండ (1992)

  • గాంగ్ లీడర్ (1991)

  • కర్తవ్యం (1991)

  • మామగారు (1991)

  •  నాకు పెళ్ళాం కావాలి (1987)

  • శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూపు (1987)

  • స్వాతిముత్యం (1985)

  • మయూరి (1984)

  • మహానగరంలో మాయగాడు (1984)

  • పట్నం వచ్చిన పతివ్రతలు (1982)

  • శుభలేఖ (1982)

  • శంకరాభరణం (1979)

  • పదహారేళ్ళ వయసు (1978)

  • శివరంజని (1978)

  • చిల్లరకొట్టు చిట్టమ్మ (1977)

  • యమగోల (1975)

  • కులగోత్రాలు (1962)

  •  భార్యాభర్తలు (1961)

  • భాగ్య దేవత  (1959)
నిర్మలమ్మ కు సంబందించిన వీడియో లు ఈ క్రింది లింక్ లలో చూడండి

Actress Nirmalamma Family Details | Gossip Adda - YouTube



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...