lalitha jewellery లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
lalitha jewellery లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, మార్చి 2019, బుధవారం

Letus know about Lalitha Jewelery's Owner's 'money can not be earn easily .. says'sKiran Kumar alias Gundu Boss

 లలిత జెవెలరీస్ ఓనర్ డబ్బులెవరికీ ఊరికే రావు ..  అంటూ టీవీల్లో కనిపించే కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్ గురించి తెలుసుకుందామా...  

డబ్బులు ఎవరికీ ఊరికే రావు అలాగే విజయం  కూడా అంత ఈజీ గా రాదు  అని లలితజవాలెరీ ఓనర్ కిరణ్ కుమార్ గారు యువత చెప్పకనే చెప్పారు.  ప్రేక్షకులు, వినియోగదారుల  ముద్దుపేరు గుండు బాస్కిరణ్ కుమార్ లలిత జ్యువెలరీ వెనుక చెన్నై, చెన్నై పరిశ్రమలో 20 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఈ షోరూం ను ప్రారంభించక  ముందే  అతను బంగారు కొనుగొలు  చేసి ఆభరణాలు తయారు చేయించి  అమ్మేవారు,  చెన్నైలోనూ, దేశవ్యాప్తంగా బాగా తెలిసిన ఆభరణాల దుకాణాలకు బంగారం సరఫరా  చేసేవారు. అతను ప్రపంచ వ్యాప్తంగా బంగారం ఎగుమతి లో విజయవంతమైన వ్యాపారవేత్త గా ఎదిగారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 916 బిఐఎస్ హాల్మార్కెడ్ గోల్డ్ జ్యువెలరీని ప్రవేశపెట్టిన వ్యక్తి ఇతనే అని చెప్పుకోవచ్చు.

  • కిరణ్  కుమార్ పుట్టింది నెల్లూరులోనెల్లూరికి బంగారు నగల తయారీ కేంద్రంగా బాగా పేరుంది. అక్కడ పనిచేయడానికి కిరణ్ కుటుంబం ఎనభై ఏళ్లకిందట రాజస్థాన్ నుంచి వచ్చి స్థిరపడింది
  • తండ్రి పేరు మూల్చంద్జైన్‌ తల్లి పేరు సుశీలాబాయి. వాళ్లకి ఎనిమిదిమంది సంతానం.  కిరణ్ కుమార్  చివరి వారు.

  • ఆరుగురు అక్కలూ, ఇద్దరు అన్నలు నాకు. పెద్ద కుటుంబం కావడం వల్ల కటిక దారిద్య్రం తప్పలేదు. తండ్రి గారు  బంగారు దుకాణాల్లోనూ, బట్టల దుకాణాల్లోనూ పనిచేసేవాడు. రోజుకి మూడుపూటలా కాదుకదా ఒక్కపూట తిండి దొరకడమే కష్టంగా ఉండేది
  • కిరణ్  చిన్నప్పుడు అందరితోపాటే బడిలో చేరాడు  కానీ... అదేమిటో అతని బుర్రలోకి ఒక్క అక్షరం ముక్క కూడా వెళ్లేది కాదు. ఎలాగోలా ఐదో తరగతి దాకా నెట్టుకువచ్చినా  తర్వాత మానేశా రు 

  • కిరణ్  వాళ్ళ నాన్న గారు  ‘మా ఖర్మకొద్దీ పుట్టావురా నువ్వు...!’ అని ఎప్పుడూ తిడుతుండేవాడు. ఇంట్లోని కష్టాల వల్ల కావొచ్చు... తొమ్మిదేళ్లకే  కిరణ్ కి  జీవితంపైన ఒక స్పష్టత వచ్చేసింది. అప్పట్లో అతని  ఈడు వాళ్లు బంగారు దుకాణాల్లో కూలీకి వెళుతుంటే ఆటను కూడా వాళ్లతో కలిసి వెళ్లడం మొదలుపెట్టారు 
  • మూడేళ్ల తర్వాతే నెల్లూరులో తయారుచేస్తున్న నగల్ని చెన్నై, కేరళల్లోని దుకాణాలకి హోల్సేల్గా అమ్ముతారని తెలిసింది. నేనూ అలా అమ్మాలనుకున్నా. మరి నగల తయారీకి బంగారం కావాలి కదా! కిరణ్  అమ్మగారి ఇంట్లో అమ్మ భద్రంగా దాచుకున్న నాలుగు బంగారు గాజులుండేవి. ఆమెకి చెప్పకుండా వాటిని తీసుకెళ్లి కరిగించి 65 గ్రాముల్లో కొన్ని జుమ్కీలు చేయించారు,వాటిని తీసుకుని చెన్నై వెళ్లిపోయారు 

  • అక్కడ  కిరణ్  బాగా విన్న దుకాణం పేరు 'లలితా జ్యువెలరీస్! దుకాణం ముందు నిల్చున్నారు.అప్పుడే సంస్థ ఓనర్కందస్వామి కారు దిగుతున్నారు. ఆయన దగ్గరకెళ్లి  కిరణ్  తెలుగు, హిందీ కలగలిపిమీకోసం నగలు అమ్మడానికి నెల్లూరు నుంచి వచ్చానుఅని చెప్పారు .
  • పన్నెండేళ్ల కుర్రాణ్ణి కదా! ఏదో సరదాపడుతున్నానని అనుకున్నాడేమోసరే చూపించు!’ అన్నారు. ఎర్రటి కాగితంలో చుట్టుకొచ్చిన నా 65 గ్రాముల జుమ్కీలు చూపించాను! రోజూ కిలోల లెక్కన నగలు కొనే ఆయనవాటిని చూసి నవ్వేశారు. అయినా నన్ను నిరుత్సాహపరచకుండా వీటిని నేను టెస్ట్చేయాలి... రేపు రా!’ అన్నారు

  • కిరణ్  ఇంటి కెళితే అందరూ నగల కోసం వెతుకుతూ ఉన్నారు. విషయం చెప్పాను. చెప్పకుండా  తీసుకు వెళ్లాననే భాద కొంత తగ్గింది కానీ నాన్న అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. అమ్మ మాత్రంఇంట్లో మిగిలిన చివరి నగలవి... నువ్వే ఆలోచించుకో!’ అని మాత్రమే చెప్పింది
  • తర్వాతి రోజు ఉదయమే మళ్లీ లలితా జ్యువెలరీస్కి వెళ్లారు కిరణ్  కిరణ్ కుమార్ ని  చూడగానే... ‘ఇలాంటివే మరిన్ని చేసుకురా!’ అని చెబుతూ... 15 వేల రూపాయలు డబ్బులిచ్చారు కందస్వామి. వ్యాపారిగా  కిరణ్  తొలి సంపాదన అది!   

  • కిరణ్ కి అందులో వచ్చిన లాభంతో మరికాస్త బంగారం కొని  24 గంటలపాటు తిండీ, నిద్ర మాని ఈసారి వంద గ్రాముల నగలు తయారుచేసుకుని వెళ్లారు . సాధారణంగా అలా నగలు తయారుచేయడానికి  ఎవరికైనా వారం పడుతుంది కిరణ్  రెండోరోజే ఆయన ముందుకి వెళ్లడం చూసి విస్తుపోయారాయన.
  • ఇతను క్రమంగా 200గ్రా., 300గ్రా., 1000గ్రా... అలా ఆరునెలల్లోనే మూడు కిలోల బంగారు నగలు చేసిచ్చే స్థాయికి చేరుకున్నడు . తర్వాతి నుంచీ పూర్తిగా  కిరణ్  దగ్గరే నగలు కొనడం ప్రారంభించారు. 

  • లలితా జ్యువెలరీస్తో పాటూ ఇతర పెద్ద దుకాణాలూ ఆర్డర్లు ఇచ్చాయి. దాంతో మొదటి ఏడాదే ఏడు లక్షల రూపాయల వ్యాపారం చేశాను
  • కిరణ్ మేజర్  అయ్యాక అష్రఫ్అనే మిత్రుడి భాగస్వామ్యంతోఏకే జ్యువెలర్స్‌’ పేరుతో హోల్సేల్నగల దుకాణాన్ని రిజిస్టర్చేశాను. ఎనిమిదేళ్లలో దక్షిణాదిలోనే నంబర్వన్హోల్సేల్నగల తయారీదారుగా పేరు తెచ్చుకున్నారు . రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి. కఠోర శ్రమే నన్ను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసింది. నా విజయానికి తొలిమెట్టుగా నిలిచిన లక్షణం అదే!

  • అది 1996 ప్రాంతం... లలితా జ్యువెలరీస్సంస్థ యాజమాన్యం నష్టాల్లో కూరుకుపోయింది. ‘అప్పులవాళ్ల వల్ల నేను అరెస్టు కావడమో... దుకాణాన్ని మూసేయడమో!’ రెండేదార్లున్నాయి నాకు అని  కిరణ్  ముందు కన్నీరు పెట్టుకున్నారు దాని యజమాని కందస్వామి
  • కిరణ్ కి జీవితాన్నిచ్చిన సంస్థ అలా మునిగిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలరు ?! అందువల్ల 1999లో కిరణ్ గారే దాన్ని కొన్నారు . కొన్నారే  కానీ ఆరునెలలపాటు అతని కేమి అర్థంకాలేదు. హోల్సేల్వ్యాపారిగా గంటకి పది కిలోల నగలు అమ్మే కిరణ్ గారు  రీటైల్లో రోజంతా కష్టపడ్డా కిలో బంగారం నగల్ని అమ్మలేకపోయేవారు. 

  • నాలుగేళ్లలోనేఅసలు ఇటు ఎందుకొచ్చానురా భగవంతుడా!’ అనే పరిస్థితిలో పడ్డారు . అయినాసరే, వెనక్కి తగ్గాలనుకోలేదు అతను  కొత్తగా ఏమేం చేయొచ్చో ఆలోచించడం మొదలుపెట్టారు నాణ్యత ఉన్నతంగా ఉండాలని దక్షిణాదిలోనే తొలిసారి బీఐఎస్హాల్మార్కు నగల్ని పరిచయం చేశారు.
  • వాటిని కూడా హోల్సేల్ధరలకే అమ్మేవారు  వారి లాభాలు తగ్గించుకుని తరుగు తొమ్మిదిశాతం మించకుండా చూసుకునేవారు .ఇవన్నీ వినియోగదారుల్ని ఆకర్షించాయి. లాభాలు పెరిగాయి

  • కానీ, ‘మాకంటే నువ్వు తక్కువ ధరకు అమ్మడానికి వీల్లేదంటూనగల దుకాణాల సంఘాలు కిరణ్ కుమార్ కు హుకుం జారీ చేశాయి... వాటిని పట్టించుకోలేదు. పోటీదారులు నేరుగానే కిరణ్ ను బెదిరించారు... భయపడలేదు. కిరణ్ గారు తమ  పని తాను  చేసుకుంటూ పోయారు . వాటిని పట్టించుకోని ధైర్యమే కిరణ్ కుమార్ ని  ఇప్పటిదాకా నడిపిస్తోంది. అదేలేకుంటే జీవితంలో సవాళ్ళని ఎదుర్కోలేం, కొత్తగా ఏదీ సాధించలేం అని కిరణ్ అనుకునే వారు.
  • మొదట్లో లలితా జ్యువెలరీస్కి నగలు సరఫరా చేయడం కోసం నెల్లూరు నుంచి చెన్నైకి  కిరణ్ వెళ్లాల్సి వచ్చేది. రాత్రి బస్సులకైతే ఛార్జీ రెండు రూపాయలు తక్కువని వాటినే ఎక్కేవారు  లక్షలు సంపాదిస్తున్నప్పుడూ అంతే. ‘లలితా జ్యువెలరీస్‌’ని కొన్నాకే చెన్నైకి మకాం మార్చారు 

  • కిరణ్  అక్కడ చెన్నైలోని  ఇంటి నుంచి దుకాణానికి ఆటోలోనే వెళ్లేవారు .అతని కున్న 21 దుకాణాల్లో ఎక్కడా ఛైర్మన్గా కిరణ్ కంటూ ప్రత్యేక క్యాబిన్ ఉండదు. మిగతా ఉద్యోగులతో పాటు స్టోర్లోనే కూర్చుండె వారు.
  • కిరణ్ గారు తమ  సంస్థ ప్రకటనలని స్టార్హీరోల చేత చేయించకపోవడానికీ అదే కారణం. తానే నటించాలని అనుకున్నాక మేకప్లూ, విగ్గులూ వేసుకోమన్నారు చాలామంది. అది కూడా దండగ ఖర్చు అనిపించే కిరణ్ గారు  గుండు తోనే టీవీల ముందుకు వచ్చేశారు. 

  • ఇలాంటి వాటికి నిరాడంబరత అనే పెద్ద పదం అక్కర్లేదు అని అంటారు ఆతను  ఇదంతా కేవలం వ్యాపార మనుగడ కోసం ఆచి తూచి ఖర్చు పెట్టడం మాత్రమే. కానీ జీవితంలో  అతనికి కొన్ని కలలుండేవి. కారు కొనడం అందులో మొదటిది !  లలితా జ్యువెలరీస్ని కొన్న చాలా ఏళ్ల తర్వాతే  కిరణ్  కారుకొన్నారు.
  • రోజు దానికి పూజ చేసి రాత్రి ఇంటికి తెచ్చారు కిరణ్ గారు కానీ  పడుకున్నాక రెండుగంటలకి మెలకువ వచ్చిచ్చింది అట  కిరణ్  గారి కు నిజంగానే కారు కొన్నానా... అంత గొప్పవాణ్ణయ్యానా?! కాదు ఇదంతా కలేనేమో!’ అనిపించింది అని అనిపించి  హడావుడిగా లేచి పార్కింగ్కి వెళ్లి కారు డోర్తీసి... హారన్మోగించాక కానీ... కిరణ్క్  తృప్తిగా అనిపించలేదు. ఎంతగా ఆచితూచి ఖర్చుపెట్టినా కలలని దూరం చేసుకోకూడదనీ, అవే మన జీవితాల్ని ఉత్సాహంతో నింపుతాయనీ రోజే కిరణ్  తెలుసుకున్నారు.

  • చిన్నప్పుడు  స్కూల్లోనే కాదు, ఇప్పటికీ  కిరణ్  ఇంగ్లిషు అక్షరాలని గుర్తుపెట్టుకోలేరు . విదేశాలకి వెళుతున్నప్పుడు ఎయిర్పోర్టులో దరఖాస్తు నింపాలికదా... అందులోఇండియన్‌’ అనే పదాన్ని రాయాలన్నా కిరణ్ గారు  తడబడతారు 

  • కిరణ్ గారి లలితా జ్యువెలరీస్ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల  సామ్రాజ్యం అయింది.   అయినా  ఇతను  ఇప్పటికీ కరెన్సీ కట్టల్ని సరిగ్గా లెక్కపెట్టలేరు . ఎప్పుడు లెక్కపెట్టినా ఎక్కువో తక్కువో వస్తుంది. అయితే లాభనష్టాలని మాత్రం కచ్చితంగా భేరీజు వేయగలరు. ఫలానా గంటకి ఇంత బిజినెస్జరుగుతుందని చెప్పగలరు.
  • చదువులేని  కిరణ్ గారికి  దేవుడిచ్చిన పెద్ద వరం మైండ్కాలిక్యులేషన్‌’ అనిపిస్తుంది. అంతకన్నా పెద్ద వరం కిరణ్ గారి  దగ్గర పని చేసే ఉద్యోగులు. నెల్లూరులో ఒకప్పుడు కిరణ్ గారి తో  కలిసి పనిచేసినవాళ్లూ, వాళ్ల పిల్లల్లో 90 శాతం మంది ఇప్పటికీ ఇతని  దగ్గర పనిచేస్తున్నారు 

  • కిరణ్ గారికి  చదువులేకున్నా వాళ్లేం రాస్తున్నారో... లెక్కలు వేస్తున్నారో అని ఇంకెవరి చేతో తనిఖీ చేయించరు . పక్కవారిని అనుమానంతో కాకుండా ప్రేమతో ఆదరిస్తే అద్భుతాలు చేయొచ్చనే విశ్వాసం కిరణ్ గారికి ఉద్యోగుల వల్లే వచ్చింది.
  • కిరణ్ గారు  ఎక్కడ షోరూమ్తెరిచినా దానికి అనుబంధంగా ఫ్యాక్టరీని కూడా ఏర్పాటుచేసి ప్రాంతంలోని వృత్తిపనివాళ్లకి ఉద్యోగాలు కల్పిస్తారు అట . రకంగా వీరి  సంస్థలో వేలాదిమంది ఉద్యోగులున్నారు.

  • ఇతని దుకాణాల్లో పనిచేసేవాళ్లందరికీ మధ్యాహ్నంపూట ఉచితంగా భోజనం పెడతారు . ఇక తనకున్న చిట్టచివరి బంగారు నగలతో నన్ను ఇంతటివాణ్ణి చేసిన అమ్మ గుర్తుగా, ఆమె పెరిగిన రాజస్థాన్బలానా ప్రాంతంలో పెద్ద బడి కట్టించారు.
  • అక్కడ వెయ్యి (1000) మంది పిల్లలు ఉచితంగా చదువుకోవచ్చు అక్కడ! వందేళ్లపాటు సున్నం కొట్టాల్సిన అవసరం లేకుండా చలువ రాళ్లతో కట్టించారు కిరణ్ గారు . మనం ఎంత ఎత్తుకి ఎదిగినా దానికి ఏదో రకంగా వనరులని ఇచ్చేది సమాజమే! దానికి తిరిగి ఇవ్వడంలోని సంతృప్తి చిన్నదేం కాదు! అని నమ్మే వారి లో కిరణ్ గారు ఒకరు 

  • ఇంతా ఎందుకు చెబుతున్నానంటే...గుండుబాస్‌’, ‘గుండాయన.  కిరణ్  అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది ఇతన్ని ఇలాగే గుర్తుపెట్టుకుంటున్నారు

  • ఇక ఇతని ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ కిరణ్ గారికి  కోపం తెప్పించడం లేదు... కిరణ్ కూడా వాటిని భలే ఎంజాయ్చేస్తున్నారు. వాటిని తయారుచేసేవాళ్లలో ఎక్కువశాతం యువతేనని వారికీ తెలుసు. యువతని ఎక్కువ అబిమానించేవారిలో అతనొకరు. 
  • కిరణ్ పైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నాయువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా!   కలలు నెరవేరేందుకు ఎంతోకొంత ఉపయోగ పడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా వారి జీవితానుభవాలను కిరణ్  మీతో పంచు కుంటు న్నారు .  ‘డబ్బులెవరికీ ఊరికే రావు...’ అంటూ టీవీల్లో కనిపించే  కిరణ్  విజయం ఎవరికీ ఊరికే రాదు..’ అని యువతకి చెప్పాలనుకుంటున్నారు.

  • కిరణ్ గారు  పిల్లలతో  కలిసి ఏడాదికి 2 లేదా 3 సార్లయినా విదేశాలకి వెళుతుంటారు. అక్కడికెళ్లినా వ్యాపారం గురించే ఆలోచిస్తుంటారు. ‘మీరు ఎక్కడి కొచ్చినా బిజినెస్‌ మేనియాలో ఉన్నట్టుంటారు.అని విసుక్కుంటారు అతని పిల్లలు.  
  • కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్ వదిలించుకోవాలనుకుంటున్న లక్షణం అదే! హాట్స్ ఆఫ్ కిరణ్ గారు.  

Lalithaa Jewellery Success Story l MD Kiran Kumar ... - YouTube

Lalitha Jewellery Owner Kiran Kumar's Success Story - TV9 - YouTube

Lalitha Jewellery Owner Kiran kumar - Interesting Facts ... - YouTube

Lalitha Jewelley Success Story | Lalitha Jewellery MD Kiran Kumar ...

Lalitha Jewellery Showroom Vizag CMD Kiran Kumar - YouTube

LALITHA JEWELLERY CHAIRMAN KIRANKUMAR - YouTube

Search Results

Kiran Kumar Lalithaa Jewellery Ads - YouTube





https://www.youtube.com/watch?v=M70VasgTVlg


https://www.youtube.com/watch?v=SvdkHw6glI4

kiran kumar in Linkedin.com Managing Director Lalithaa Jewellery - Lalithaa ...

Kirankumar | Lalithaajewellery 

Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.   కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.











పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...