స్టార్ మా బిగ్ బాస్ - 4 తెలుగు త్వరలో రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు అందరు రడీయేనా ...
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ల తో స్టార్ మా మంచి టి. ఆర్.పి సంపాదించడం మనకి అందరికి తెలుసు . ఇప్పటి వరకు జరిగిన 3 తెలుగు బిగ్ బాస్ షో లు విజయవంతం గా పూర్తి అయ్యాయి . బిగ్ బాస్ -1 తెలుగు కి జూనియర్ యన్ .టి. ఆర్., బిగ్ బాస్ -2 తెలుగు కి నాని మరియు బిగ్ బాస్-3 కి నాగార్జునగారు హోస్ట్ చేసి రక్తి కట్టించారు. 1, 2 బిగ్ బాస్ ల కంటే=3 కొద్దిగా చప్పగా ఉండనే చెప్పాలి . బిగ్ బాస్ -4 అద్భుతం గా రక్తి కటిస్తుందని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
బిగ్ బాస్ -4 కి నాగార్జున కాకుండా తరుణ్ హోస్ట్ చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణం గా జూన్ లో నిర్వహించవలసిన ఈ షో కోవిద్ -19 లాక్ డౌన్ దృష్ట్యా కొంత పోస్ట్ పొన్మెంట్ అవుతాదేమో అని అనుకుంటున్నారు. కానీ స్టార్ మా అనుకున్న సమయాని కే బిగ్ బాస్ -4 తెలుగు ప్రారంభము అవుతుందని అందరు భావిస్తున్నారు.
వర్షిణి,సౌందర్యరాజన్, మంగ్లీ, అఖిల్ సార్థక్
మరి కొంత మంది కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. మిగతా వారి వివరాలు బిగ్ బాస్-4 ప్రారంభానికి ముందు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయగానే షూటింగ్ లు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో నే బిగ్ బాస్ సెట్టింగ్ లు తయారు అవుతున్నాయని తెలిసింది.