5, సెప్టెంబర్ 2020, శనివారం

పాత చిత్రాల నటుడు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు గురించి తెలుసు కుందామా

పాత  చిత్రాల నటుడు హరనాథ్ గురించి తెలుసు కుందామా 

ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి జిల్లా  గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాల రాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.

హరనాథ్ బయో గ్రఫీ 

• పూర్తీ పేరు : బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు

•జననం :1936 సెప్టెంబరు 2, రాపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

• తండ్రి పేరు : బుద్ధరాజు వరహాలరాజు ,

• తల్లి పేరు : సుభద్రమ్మ ,

• తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఒక సోదరి ,

• చదువు : బి.ఎ. (పి.ఆర్ .కాలేజీ , కాకినాడ ),

• పిల్లలు : కొడుకు : నిర్మాత - జి .వి.జి. రాజు.

• వృత్తి : సినీ నటుడు

• క్రియాశీలక సంవత్సరాలు: 1959 – 84

• మరణం: 1989 నవంబరు 1 (వయసు 53) (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989)

హరనాథ్ గురించి వివరంగా 

బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు తెలుగు సిని నటుడు , కాలేజి రోజుల నుండే నటించడం ఆరంభించారు , ఒక రోజు పాండి బజార్ లో షూస్ కొనుతుండగా దర్శకుడు 'గుట్ట రామినీడు' చూసి తన సినిమా " మా ఇంటి మహలక్ష్మి " లో హీరో గా సెలెక్ట్ చేసారు . అంచలంచెలు గా మంచి యాక్టరయ్యారు. నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.

కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. 

మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు. నందమూరి తారక రామారావు  నిర్మించిన  సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. 

చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి.1989 నవంబరు 1 (వయసు 53) (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) న మద్యపానం అతిగా సేవించడం వాళ్ళ వికటించి మరణించారు. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన నాగు. ఈ సినిమాలో హరనాథ్ తండ్రి పాత్ర పోషించారు. 

హరనాథ్ నటించిన సినిమాలు

• కలవారి సంసారం (1982)

• గడసరి అత్త సొగసరి కోడలు (1981)

• భలే పాప (1971)

• శ్రీదేవి (1970)

• చల్లని నీడ (1968)

• బంగారు సంకెళ్ళు (1968)

• భక్త ప్రహ్లాద (1967)

• శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)

• శ్రీకృష్ణ పాండవీయం (1966)

• సర్వర్ సుందరం (1964)

• మురళీకృష్ణ (1964)

• గుండమ్మ కథ (1962)

• బాల భారతం (1972)

• కథానాయిక మొల్ల (1970)

• తల్లి తండ్రులు (1970)

• ప్రేమకానుక (1969)

• నడమంత్రపు సిరి (1968)

• పెళ్ళిరోజు (1968)

• చదరంగం (1967)

• లేత మనసులు (1966)

• చంద్రహాస (1965)

• అమరశిల్పి జక్కన్న (1964)

• పెంపుడు కూతురు (1963)

• భీష్మ (1962)

• కలసివుంటే కలదుసుఖం

• మా ఇంటి మహాలక్ష్మి (1959)

ఈ క్రింది వీడియో యు. ఆర్ .యల్ ల పై క్లిక్ చేసి హరినాధ్ గురించి ఇంకా  తెలుసుకోండి 


Note: 

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.














28, ఆగస్టు 2020, శుక్రవారం

స్టార్ మా బిగ్ బాస్ -4 ఫైనల్ లిస్ట్ వచ్చేనెల నుండి ఎపిసోడ్ లు ప్రారంభం డేట్ ఓకే .

స్టార్ మా బిగ్ బాస్ - 4 ఫైనల్ లిస్ట్ వచ్చేనెల నుండి ఎపిసోడ్ లు ప్రారంభం డేట్ ఓకే 


స్టార్ మా బిగ్  బాస్ తెలుగు (4) నాలుగో సీజన్‌తో తిరిగి వస్తోంది మరియు సెప్టెంబర్ 6 న సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ మాలో ప్రీమియర్ ప్రదర్శన ఇవ్వబోతోంది. చాలా మంది ప్రజలు ఈ సీజన్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రదర్శన గత సంవత్సరం కంటే అధిక టి.ఆర్.‌పి.లను పొందబోతోందని ప్రజలు అనుకొంటున్నారు. టాలీవుడ్ 'కింగ్' నాల్గవ సీజన్కు కూడా హోస్టింగ్ చేస్తారని తెలుస్తోంది. మన్మదుడు అభిమానులు కూడా అతన్ని బుల్లి  తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున 

పోటీదారుల జాబితా ఈ క్రింది విధంగా ఉండబోతోంది అని తెలుస్తోంది

బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున 

మొత్తం ఎపిసోడ్లు 106

కంటెస్టెంట్ లు 16 మంది 

ప్రారంభం తేదీ : సెప్టెంబర్ 06 2020 సాయంత్రం 6 గంటలకు ప్రోమో విడుదల 

బిగ్ బాస్ -4 (ప్రోమో) Big Boss 4 (Promo)

బిగ్ బాస్ కంటెస్టెంట్ లు లిస్ట్ ఇదుగో ఇదే చూడండి 

గంగవ్వ యూట్యూబ్ నటి

మెహబూబా దిల్ సే యూట్యూబ్ 

డెతడి హారిక యూట్యూబ్


రఘుమాస్టర్ (కొరియో గ్రాఫేర్)

ప్రణవి (కొరియో గ్రాఫేర్)

పూనమ్ బజ్వా నటీమణి 

హంస నందిని నటీమణి 

దివ్య విద్య నటీమణి

స్వాతి దీక్షిత్ నటీమణి 

అఖిల్ సార్థక్ నటుడు 

అభిజిత్ నటుడు

సయ్యద్ సోహెల్ ర్యాన్ నటుడు 

అరియనా గ్లోరీ (యాంకర్ )

దేవి నాగవల్లి (యాంకర్)

జోర్దార్ సుజాత (యాంకర్)

లాస్య మంజునాథ్ (యాంకర్)

నోయెల్ సీన్ (సింగర్)

ముక్కు అవినాష్ (కమెడియన్ )

కరాటే కళ్యాణి (కమెడియన్ ఫీమేల్ )
ఈ క్రింది వీడియో యు ఆర్. యల్ లు చూసి ఇంకా తెలుసుకోండి

Bigg Boss 4 Telugu Contestants in Quarantine | Bigg Boss 4 Telugu | NTV Entertainment


Bigg Boss 4 Telugu : Final Contestants List | Bigg Boss Telugu Season 4 Confirmed Contestants |#Bb4


Bigg Boss 4 Final Contestants List | YOYO TV - YouTube

Telugu Big Boss 4 Full Contestants List | #Bigboss4 - YouTube


Note:  

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like, share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుందథాంక్యూ.











28, జులై 2020, మంగళవారం

నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గురించి తెలుసు కుందామా

నటుడుదర్శకుడురచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గురించి తెలుసు కుందామా

నటుడుదర్శకుడురచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. రావి కొండల రావు దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటిమణి.

రావి కొండల రావు గారి పరిచయం 

  • రావి కొండల రావు 1932ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు.
  • ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 
  • 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. 
  • పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. 
  • కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. 
  • నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్లు  సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. 
  • కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. 
  • రావి కొండల రావుకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు.
  • సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. 
  • ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. 
  • విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. 
  • కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. 
  • రాధాకుమారి గారు తొలి చిత్రం తేనె మనసులు
 రావి కొండలరావు నటుడిగా నటించిన చిత్రాల జాబితా

  • కింగ్ (2008)- అతిథి పాత్ర
  • మీ శ్రేయోభిలాషి (2007)
  • నిన్నే ఇష్టపడ్డాను (2003)
  • శ్రీ కృష్ణార్జున విజయం (1996)
  • మేడమ్ (1993)
  • బృందావనం (1992 సినిమా)
  • పెళ్ళి పుస్తకం (1991)
  • ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం(1991)
  • చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
  • సాహసం చేయరా డింభకా (1988)
  • చంటబ్బాయ్ (1986)
  • రుద్రకాళి (1983)
  • మంత్రి గారి వియ్యంకుడు (1983)
  • ఊరికిచ్చిన మాట (1981)
  • రాధా కళ్యాణం (1981)
  • సొమ్మొకడిది సోకొకడిది (1978)
  • ఇదెక్కడి న్యాయం (1977)
  • ఇల్లు - వాకిలి (1975)
  • అందాల రాముడు (1973)
  • దసరా బుల్లోడు (1971)
  • శ్రీమంతుడు (1971)
  • శ్రీకృష్ణ విజయం (1970)
  • ప్రేమకానుక (1969)
  • వరకట్నం (సినిమా) (1968)
  • వింత కాపురం (1968)
  • ప్రేమించి చూడు (1965 సినిమా) 
  • శోభ (1958 సినిమా) 

నిర్మాత గా రావి కొండల రావు గారు


  • శ్రీకృష్ణార్జున విజయం (1996) (పర్యవేక్షక నిర్మాత)


  • భైరవ ద్వీపం (1994) (పర్యవేక్షక నిర్మాత)


  • బృందావనం (1992 సినిమా) (1992) (పర్యవేక్షక నిర్మాత)

  • రచయితగా రావి కొండల రావు గారు



  • భైరవ ద్వీపం (1994) (సంభాషణలు)



  • బృందావనం (1992 సినిమా) (సంభాషణలు)


  • పెళ్ళి పుస్తకం (1991) (కథ)


  • చల్లని నీడ (1968) (రచయిత)
  • సాహిత్య రంగంలో పత్రికల్లలో రావి కొండల రావు గారు:

    • ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు. 
    • హాస్యరచయితగా గుర్తింపు పొందాడు. 
    • సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు. 
    రావి కొండల రావు  రాసిన కొన్ని కథలు
    1. అనురాగం
    2. అభిప్రాయం
    3. అభిమాన పుస్తకం
    4. అసంభవామి యుగేయుగే
    5. ఆడదిక్కు
    6. ఆత్మహత్య
    7. ఆవు పులి
    8. ఇదీ ఓ కథే
    9. ఎదురుచూడని వరుడు
    10. ఏడో చేప
    11. కంగారూ కనకంగారూ
    12. కంపార్టుమెంటాలజి
    13. కనబడుట లేదు
    14. కబుర్లూ...
    15. కలం స్నేహం
    16. కలలో వినాయకుడు
    17. కోతితోక
    18. గయ్యాళి
    19. చంద్రశేఖరుని కథ
    20. చావుల కొండ
    21. చిక్కుడుకాయలూ...
    22. చిత్రఖేదం
    23. చిత్రమోదం
    24. చిత్రలాభం
    25. తప్పిపోయినాడు
    26. తెలుగుమాస్టారి స్వగతం
    27. తొందరపాటు
    28. తోడేలు-గొర్రెపిల్ల
    29. దాహంగల కాకి
    30. దిదృక్ష
    31. దొంగ
    32. నాణెం
    33. నిరుద్యోగ పర్వం
    34. నీతి
    35. నేరపరిశోధన
    36. పండితుడు-రాజు
    37. పాము-సన్యాసి
    38. పాలు-నీళ్లూ
    39. పిరికిపందలు
    40. భయంలేని వాడు
    41. భూత "గోస్ట్" కథ నేను సుబ్బారావుని
    42. మర్కటాలూ మిణుగురులూ
    43. మళ్లీ చెప్పిన కథ
    44. మాయమైన మనీపర్సు
    45. ముకుంద...
    46. ముక్తిమార్గం
    47. ముమూర్ష
    48. మూడు చేపలు
    49. రట్టూ గుట్టూ
    50. రామూర్తి పెళ్లయింది
    51. రెండు శవాలు
    52. రైలు పట్టాలు
    53. లంచగొండి-యమలోకం
    54. వాళ్లూ, నేనూ
    55. వ్యర్థపుటాశలు
    56. సంతుష్టి
    57. సన్మాన సభ
    58. సింహం-కుందేలు
    59. సుబ్బారావు సూర్యకాంతి
    60. స్థిరపడిన సంబంధం

    రావి కొండల రావు  రాసిన కొన్ని పుస్తకాలు

    1. (సి)నీతిచంద్రిక
    2. హ్యూమరథం (రెండు భాగాలు)
    3. మల్లీశ్వరి (సినిమా నవల)
    4. బ్లాక్ అండ్ వైట్
    5. రావి కొండలరావు నాటికలు
    6. రావి కొండలరావు కథలు
    7. నాగావళి నుంచి మంజీర వరకు

    రావి కొండల రావు పొందిన పురస్కారాలు

    • బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం (2004) లో పొందారు  
    • అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం


      రావికొండల రావు మరణం

      హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని మనమందరం మనస్ఫూర్తిగా ప్రాద్దిద్దాం. 


      Note:

      నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,

      నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  

      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి

      అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి

      అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి

      Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,

      Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and  Subscribe,   కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది థాంక్యూ.









      పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

      పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...