పాత చిత్రాల నటుడు హరనాథ్ గురించి తెలుసు కుందామా
ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాల రాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు కుమారుడు శ్రీనివాస రాజు, కుమార్తె పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.
హరనాథ్ బయో గ్రఫీ
• పూర్తీ పేరు : బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు
•జననం :1936 సెప్టెంబరు 2, రాపర్తి , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
• తండ్రి పేరు : బుద్ధరాజు వరహాలరాజు ,
• తల్లి పేరు : సుభద్రమ్మ ,
• తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఒక సోదరి ,
• చదువు : బి.ఎ. (పి.ఆర్ .కాలేజీ , కాకినాడ ),
• పిల్లలు : కొడుకు : నిర్మాత - జి .వి.జి. రాజు.
• వృత్తి : సినీ నటుడు
• క్రియాశీలక సంవత్సరాలు: 1959 – 84
• మరణం: 1989 నవంబరు 1 (వయసు 53) (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989)
హరనాథ్ గురించి వివరంగా
బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ రాజు తెలుగు సిని నటుడు , కాలేజి రోజుల నుండే నటించడం ఆరంభించారు , ఒక రోజు పాండి బజార్ లో షూస్ కొనుతుండగా దర్శకుడు 'గుట్ట రామినీడు' చూసి తన సినిమా " మా ఇంటి మహలక్ష్మి " లో హీరో గా సెలెక్ట్ చేసారు . అంచలంచెలు గా మంచి యాక్టరయ్యారు. నందమూరి తారక రామారావు గారు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు.
కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరినాధ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు.
మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు. నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు.
చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి.1989 నవంబరు 1 (వయసు 53) (సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) న మద్యపానం అతిగా సేవించడం వాళ్ళ వికటించి మరణించారు. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన నాగు. ఈ సినిమాలో హరనాథ్ తండ్రి పాత్ర పోషించారు.
హరనాథ్ నటించిన సినిమాలు
• కలవారి సంసారం (1982)
• గడసరి అత్త సొగసరి కోడలు (1981)
• భలే పాప (1971)
• శ్రీదేవి (1970)
• చల్లని నీడ (1968)
• బంగారు సంకెళ్ళు (1968)
• భక్త ప్రహ్లాద (1967)
• శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
• శ్రీకృష్ణ పాండవీయం (1966)
• సర్వర్ సుందరం (1964)
• మురళీకృష్ణ (1964)
• గుండమ్మ కథ (1962)
• బాల భారతం (1972)
• కథానాయిక మొల్ల (1970)
• తల్లి తండ్రులు (1970)
• ప్రేమకానుక (1969)
• నడమంత్రపు సిరి (1968)
• పెళ్ళిరోజు (1968)
• చదరంగం (1967)
• లేత మనసులు (1966)
• చంద్రహాస (1965)
• అమరశిల్పి జక్కన్న (1964)
• పెంపుడు కూతురు (1963)
• భీష్మ (1962)
• కలసివుంటే కలదుసుఖం
• మా ఇంటి మహాలక్ష్మి (1959)
ఈ క్రింది వీడియో యు. ఆర్ .యల్ ల పై క్లిక్ చేసి హరినాధ్ గురించి ఇంకా తెలుసుకోండి
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి,నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com like, share and subscribe చేయండి. అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి. Also see my Youtube channel bdl 1tv like, share and subscribe,Also see my Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్, షేర్, లైక్ మాకెంతో మేలు చేస్తుంద, థాంక్యూ.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి