23, మే 2020, శనివారం

స్టార్ మా బిగ్ బాస్ - 4 తెలుగు త్వరలో రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు అందరు రడీయేనా ...

స్టార్ మా  బిగ్ బాస్ - 4  తెలుగు  త్వరలో రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు అందరు రడీయేనా ...




బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ల తో స్టార్ మా మంచి టి. ఆర్.పి సంపాదించడం మనకి అందరికి తెలుసు . ఇప్పటి వరకు జరిగిన 3 తెలుగు బిగ్ బాస్ షో లు విజయవంతం గా పూర్తి అయ్యాయి . బిగ్ బాస్ -1 తెలుగు కి జూనియర్ యన్ .టి. ఆర్., బిగ్ బాస్ -2 తెలుగు కి నాని మరియు బిగ్ బాస్-3 కి  నాగార్జునగారు హోస్ట్ చేసి రక్తి కట్టించారు. 1, 2 బిగ్ బాస్ ల కంటే=3 కొద్దిగా చప్పగా ఉండనే చెప్పాలి . బిగ్ బాస్ -4 అద్భుతం గా రక్తి కటిస్తుందని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ -4 కి నాగార్జున కాకుండా తరుణ్ హోస్ట్ చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణం గా జూన్ లో నిర్వహించవలసిన ఈ షో కోవిద్ -19 లాక్ డౌన్ దృష్ట్యా కొంత పోస్ట్ పొన్మెంట్ అవుతాదేమో అని అనుకుంటున్నారు. కానీ స్టార్ మా అనుకున్న సమయాని కే బిగ్ బాస్ -4 తెలుగు ప్రారంభము అవుతుందని అందరు భావిస్తున్నారు.

వర్షిణి,సౌందర్యరాజన్, మంగ్లీ, అఖిల్ సార్థక్

మరి కొంత మంది  కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. మిగతా వారి వివరాలు బిగ్ బాస్-4 ప్రారంభానికి ముందు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయగానే  షూటింగ్ లు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో నే బిగ్ బాస్ సెట్టింగ్ లు తయారు అవుతున్నాయని తెలిసింది.

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.














12, మే 2020, మంగళవారం

మన తెలుగు ఛానల్ యాంకర్స్, సినీ సెలె బ్రెటీస్ యూట్యూబ్ చానెల్స్, రాకెట్ లెవెల్ లో దూసుకు పోతున్న సబ్స్క్రైబర్స్

మన తెలుగు ఛానల్ యాంకరులు , సినీ సెలె బ్రెటీస్ యూట్యూబ్ చానెళ్లు, రాకెట్ లెవెల్ లో దూసుకు పోతున్న సబ్స్క్రైబర్లు

టీవీ యాంకర్లు , సినిమా ప్రముఖులు, సెలెబ్రెటీస్, లాక్ డౌన్ కొద్దీ రోజుల ముందు, లాక్ డౌన్ సమయం వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి చాల తక్కువ కాలం లోనే లక్షలు వేల లో సుబ్స్చ్రిబెర్లను  సంపాదించారు. వారిలో రవి, శ్రీ ముఖి, మంచు లక్ష్మీ ఉన్నారు. ఆ చానెళ్లు ఏమిటో ఒకసారి చూసేద్దామా  మరి.





శ్రీముఖి పేరుతో పెట్టిన ఈ ఛానల్ లో మొత్తం 13 వీడియోలు ఉన్నాయి వ్యూవర్స్ 5.87 మిల్లియన్స్ ఉన్నారు. సుబ్స్క్రైబర్స్ 111 వేల మంది ఈ ఛానల్ సబ్స్క్రయిబ్ చేసారు . ఓక ఛాన్స్ వీరో అయిపోతా, ఓక ఛాన్స్ వీరో యిన్ అయిపోతా, మీలో ఎవరికీ బోర్ కొడుతోంది ,బతుకు బలైపోయిన బండి ,చికెన్ బిర్యానీ విత్ మిర్చి  శ్రీముఖి లైవ్ టెలికాస్ట్, అన్ సీన్ సెట్స్, వ్యూస్  ఆన్ రాహుల్ సిప్లిగూంజ్ లాంటి వీడియోలు ఉంటాయి.



Chitti Chilakamma

మంచులక్ష్మీ పేరుతొ ప్రారంభించిన ఈ ఛానల్ మూడు నెలలు అయింది. ప్రతి శనివారం ఒక ఎపిసోడ్ ఉంటుంది . ఇప్పటికి 98.3 వేల మంది సుబ్స్చ్రిబెర్స్ ఉన్నారు .  ఇప్పటి 13  వీడియోలు తీశారు పిల్లలను ఎలా అవగాహనతో పెంచాలి అన్న దానిపై అవగాహన వీడియోలు ఉంటాయి . వాటిలో టీచింగ్ కిడ్స్ టు బి ఇండిపెండెంట్, వెన్ యువర్ కిడ్ సే బాడ్ వర్డ్స్, గుడ్ టచ్ బాడ్ టచ్ , హౌ టు పనిష్ కిడ్స్, మొబైల్ ఎడిక్షన్ పార్ట్1,మొబైల్  ఎడిక్షన్ పార్ట్ 2,  మార్నింగ్ రష్, స్పిల్ ఈ స్ వెల్ లాంటి వి వున్నాయి. అన్ని వీడియో లు లక్షల వ్యూస్ దాటి ఉన్నాయి . 


భారతీయ చలన చిత్రాలనిర్మాత  డైరెక్టర్,స్క్రీన్ రైటర్ పేరుతొ ఉన్న తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది.మొత్తం 294  వీడియో లు ఇందులో అప్లోడ్ చేసి ఉన్నాయి. 887 వేల మంది సుబ్స్క్రైబర్స్ ఇప్పుడు వరకు ఉన్నారు.ఇతని చిత్రాల తాలూకా ట్రైలర్స్ ఇందులో అప్లోడ్ చేస్తుంటారు.. దేవుడు కరోనా, కనిపించని ఒక పురుగు ఈ మధ్యన పెట్టిన కొత్త  అప్లోడ్ వీడియోలు.


కొన్ని తెలుగు చానెల్స్ లో ఇతను పనిచేసారు. ఇతని ఛానల్ పేరు జర్నలిస్ట్ సాయి. మొత్తం వీడియో లు అప్ లోడ్ చేసినవి 12,800 వీడియోలు ,450 కె సుబ్స్చ్రిబెర్స్ ఇప్పటి వరకు ఉన్నారు. మొత్తం వ్యూయర్స్ 337 మిలియన్లు. పొలిటికల్ రివ్యూస్ ఇతను చేస్తుంటారు. చాల స్వల్ప కాలం లో లక్షలాది వ్యూయర్స్ సుబ్స్క్రైబర్స్ ఇతను సంపాదించారు.




ప్రముఖ గాయని గీతామాధురి కి యూట్యూబ్ లో ఛానల్ ఉంది. మొత్తం వీడియోలు 21 అప్లోడ్ చేసారు  29.6 కె సుబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు .2.68 కె . (2,68,000) వ్యూస్ ఉన్నాయ్. గీతా మాధురి ఫన్నీ కోషన్స్ ఆన్సర్స్ విత్ ఫాన్స్, గీత మాధురి విత్ ఫ్రూస్ ట్రేటెడ్ విమెన్, లాంటి వీడియో లు ఉంటాయి  3 సంవత్సరాల నుండి వీడియోలు చేస్తున్నారు. 







మన తెలుగు ఎంటర్టైన్మెంట్ చాల స్వల్పకాలం లోనే సుబ్స్చ్రిబెర్స్ సంఖ్య చాల ఉంది. మొత్తం 125 వీడియోలు ఇప్పటి వరకు చేసారు వ్యూయర్స్ సంఖ్య 1.84 మిల్లియన్ దాటింది ఈ ఛానల్ లో రవి లైవ్ టెలికాస్ట్ లు,శ్రీ ముఖి టిక్ టాక్ లు, చిరంజీవి, మోహన్ బాబు మొదలైన వారి వీడియో లు ఉన్నాయి. స్వల్ప కాలం లో నే వ్యూవర్స్ బాగా పెరిగారు.  

సెలెబ్రెటీస్ యూట్యూబ్ చానెళ్లు ఈ క్రింది వీడియో లో చూడండి ...

https://www.youtube.com/watch?v=_eBesPvEAOA

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

నా ఇంకో బ్లాగ్ https://notlimitedmusic.blogspot.com like,share and subscribe  చేయండి

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.














11, మే 2020, సోమవారం

ప్రముఖ సినిమా నటి,నిర్మాత,దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ గురించి తెలుసుకుందామా

ప్రముఖ సినిమా నటి,నిర్మాత,దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ గురించి తెలుసుకుందామా

భానుమతీ రామకృష్ణ ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. సుమారు 200 (రెండువందల) సినిమాలకు పైగా నటించారు

భానుమతీ రామకృష్ణ గారి వ్యక్తిగత వివరాలు

  • పేరు : డా. పాలువాయి భానుమతి రామకృష్ణ ,
  • పుట్టిన తేది : 07 / సెప్టెంబర్ /1925 ,
  • పుట్టిన ఊరు : దొడ్డవరం గ్రామం -ఒంగోలు - ప్రకాశం జిల్లా ,
  • నివాసము : చెన్నై ,
  • తండ్రి : బొమ్మరాజు వెంకట సుబ్బయ్య -శాస్త్రీయ సంగీత ప్రియులు మరియూ కళావిశారదులు.
  • తల్లి : సరస్వతమ్మ
  • భర్త : శ్రీ పీ యస్ రామకృష్ణ- తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు,ఎడిటరు(1943, ఆగష్టు 8 ప్రేమవివాహము )
  • పిల్లలు : ఏకైక సంతానం కొడుకు - భరణి ,
  • మరణము : 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో

భానుమతి జీవిత విశేషాలు

  • భానుమతి 1925 వ సంవత్సరము సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.
  • భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

  • ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
  • 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.

సినిమాలలో విశేషాలు

భానుమతి గారు అర్ధ శతాబ్దానికి (50) పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి.

విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు.

ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు.

ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించిందిభానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది.

ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నది

భానుమతి గారి అవార్డులు
  • 1956 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
  • మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
  • అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
  • తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
  • 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
  • ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
  • 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
  • 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
  • బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
  • 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
  • 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.

  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.

భానుమతి గారి రచనలు
  • అత్తగారి కథలు
  • నాలో నేను
  • అత్తగారూ, నక్సలైట్లూ
  • భానుమతి కథానికలు

భానుమతి రామకృష్ణ గారి సినిమాల జాబితా:
  • పెళ్ళికానుక (1998) సావిత్రమ్మగా నటన
  • చామంతి (1992)
  • చెంబరుతి (1992)
  • పెద్దరికం (1992) అడుసుమిల్లి బసవపున్నమ్మ గానటన
  • సామ్రాట్ అశోక్ (1992)
  • బామ్మ మాట బంగారు బాట (1990)
  • అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
  • అత్తగారూ స్వాగతం (1988)
  • ముద్దుల మనవరాలు (1986)
  • మంగమ్మగారి మనవడు (1984) మంగమ్మ గా నటన
  • గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  • మనవడి కోసం (1977)
  • అమ్మాయి పెళ్ళి (1974)
  • తాతమ్మ కల (1974)
  • విచిత్ర వివాహం (1973)
  • అంతా మన మంచికే (1972)
  • మట్టిలో మాణిక్యం (1971)
  • గృహలక్ష్మి (1967)
  • పల్నాటి యుధ్ధం (1966) నాగమ్మ గా నటన
  • అంతస్తులు (1965)
  • తోడు నీడ (1965)
  • బొబ్బిలి యుధ్ధం (1964) మల్లమ్మ గా నటన
  • వివాహ బంధం (1964) భారతిగా నటన
  • పెంచిన ప్రేమ (1963)
  • బాటసారి (1961)
  • అంబికాపతి (1957) రాకుమారి అమరావతిగా నటన
  • నల దమయంతి (1957) దమయంతిగా నటన
  • సారంగధర (1957) చిత్రాంగి గా నటన
  • వరుడు కావాలి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956/I) రంగసాని గా నటన
  • చింతామణి (1956) .... చింతామణి గా నటన
  • మధురై వీరన్ (1956) .... రాకుమారి బొమ్మి గా నటన
  • రంగూన్ రాధ (1956) ....
  • తెనాలి రామన్ (1956) .... రంగసాని గా నటన
  • అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ (1955) గా నటన
  • కల్వనిన్ కథలి (1955) .... కళ్యాణిగా నటన
  • విప్రనారాయణ (1954) .... దేవదేవిగా నటన
  • అగ్గి రాముడు (1954)
  • చక్రపాణి (1954)
  • మలైకళ్ళన్ (1954)
  • చండీరాణి (1953/I) .... చండీరాణిగా నటన
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952) .... మోతి గా నటన
  • మల్లీశ్వరి (1951) .... మల్లీశ్వరిగా నటన
  • మంగళ (1951) .... మంగళ గా నటన
  • మాయా రంభ (1950)
  • అపూర్వ సహోదరులు (1950) .... రంజన గా నటన
  • లైలామజ్ఞు (1949/I) .... లైల గా నటన
  • రక్షరేఖ (1949) .... రాకుమారి కళావతి గా నటన
  • నల్లతంబి (1949) .... పుష్పగా నటన
  • రత్నమాల (1947) .... రత్నమాల గా నటన
  • గృహప్రవేశం (1946) .... జానకి గా నటన
  • స్వర్గసీమ (1945) .... సుబ్బి/సుజాత దేవి గా నటన
  • తాసీల్దార్ (1944) .... కమల గా నటన
  • గరుడ గర్వభంగం (1943)
  • కృష్ణ ప్రేమ (1943) .... చంద్రవల్లి గా నటన
  • భక్తిమాల (1941) .... రాధ గా నటన
  • ధర్మపత్ని (1941/I)
  • ధర్మపత్ని (1941/II)
  • మాలతీమాధవం (1940)
  • వర విక్రయం (1939) .... కాళింది గా నటన
  • పెళ్ళికానుక (1998)
  • బామ్మమాట బంగారుబాట (1990)
  • ముద్దుల మనవరాలు (1986)
  • మంగమ్మగారి మనవడు (1984)
  • గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  • మట్టిలో మాణిక్యం (1971)
  • పల్నాటి యుధ్ధం (1966)
  • అంతస్తులు (1965)
  • తోడు నీడ (1965)
  • బొబ్బిలి యుధ్ధం (1964)
  • వివాహబంధం (1964)
  • బాటసారి (1961)
  • నల దమయంతి (1957)
  • వరుడు కావాలి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956/I)
  • చింతామణి (1956)
  • విప్రనారాయణ (1954)
  • అగ్గిరాముడు (1954)
  • చక్రపాణి (1954)
  • చండీరాణి (1953/I)
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952)
  • మల్లీశ్వరి (1951)
  • మంగళ (1951)
  • అపూర్వ సహోదరులు (1950)
  • లైలామజ్ఞు (1949/I)
  • రాజశేఖర (1949)
  • రత్నమాల (1947)
  • స్వర్గసీమ (1945)
  • తాసీల్దార్ (1944)
  • గరుడ గర్వభంగం (1943)
  • కృష్ణ ప్రేమ (1943)
  • ధర్మపత్ని (1941/I)
  • వరవిక్రయం (1939)
భానుమతి రామకృష్ణ దర్శకురాలిగా చిత్రాలు:
  • అసాధ్యురాలు (1993)
  • పెరియమ్మ (తమిళం) (1992)
  • భక్త ధృవ మార్కండేయ (1982/I)
  • భక్త ధృవ మార్కండేయ (1982/II)
  • ఒకనాటి రాత్రి (1980)
  • రచయిత్రి (1980)
  • మనవడి కోసం (1977)
  • వాంగ సంభందీ వాంగ (తమిళం) (1976)
  • ఇప్పడియుమ్ ఒరు పెన్ (తమిళం) (1975)
  • అమ్మాయి పెళ్ళి (1974)
  • విచిత్ర వివాహం (1973)
  • అంతా మన మంచికే (1972)
  • గృహలక్ష్మి (1967)
  • చండీరాణి (1953/I)
నిర్మాత గా భానుమతి రామకృష్ణ గారు
  • బాటసారి (1961)
  • వరుడు కావాలి (1957)
  • చింతామణి (1956)
  • విప్రనారాయణ (1954)
  • చక్రపాణి (1954)
  • చండీరాణి (1953/I)
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952)
  • లైలామజ్ఞు (1949/I)
  • రత్నమాల (1947)
భానుమతి గారు సంగీత దర్శకురాలిగా
  • చింతామణి (1956)
  • చక్రపాణి (1954)

ఈ క్రింది వీడియో లింకులతో ఈమె బయోగ్రఫీ తెలుసుకోండి...










నోట్: 

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

నా ఇంకో బ్లాగ్ https://notlimitedmusic.blogspot.com like,share and subscribe  చేయండి

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...