11, మే 2020, సోమవారం

ప్రముఖ సినిమా నటి,నిర్మాత,దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ గురించి తెలుసుకుందామా

ప్రముఖ సినిమా నటి,నిర్మాత,దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు భానుమతీ రామకృష్ణ గురించి తెలుసుకుందామా

భానుమతీ రామకృష్ణ ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. సుమారు 200 (రెండువందల) సినిమాలకు పైగా నటించారు

భానుమతీ రామకృష్ణ గారి వ్యక్తిగత వివరాలు

  • పేరు : డా. పాలువాయి భానుమతి రామకృష్ణ ,
  • పుట్టిన తేది : 07 / సెప్టెంబర్ /1925 ,
  • పుట్టిన ఊరు : దొడ్డవరం గ్రామం -ఒంగోలు - ప్రకాశం జిల్లా ,
  • నివాసము : చెన్నై ,
  • తండ్రి : బొమ్మరాజు వెంకట సుబ్బయ్య -శాస్త్రీయ సంగీత ప్రియులు మరియూ కళావిశారదులు.
  • తల్లి : సరస్వతమ్మ
  • భర్త : శ్రీ పీ యస్ రామకృష్ణ- తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు,ఎడిటరు(1943, ఆగష్టు 8 ప్రేమవివాహము )
  • పిల్లలు : ఏకైక సంతానం కొడుకు - భరణి ,
  • మరణము : 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో

భానుమతి జీవిత విశేషాలు

  • భానుమతి 1925 వ సంవత్సరము సెప్టెంబరు 7 ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య, శాస్త్రీయ సంగీత ప్రియుడు మరియూ కళావిశారదుడు.
  • భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.

  • ఆమె 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు అయిన శ్రీ పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడినది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు.
  • 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో భానుమతీ రామకృష్ణ పరమపదించింది. తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతి మృతికి పలువురు ప్రముఖులు బాష్పాంజలి ఘటించారు.

సినిమాలలో విశేషాలు

భానుమతి గారు అర్ధ శతాబ్దానికి (50) పైబడి సినీ రంగంలో ఉన్నప్పటికీ, భానుమతి నటించిన చిత్రాలు సుమారు నూరు మాత్రమే. ఆమె సినిమాలలో మల్లీశ్వరి, మంగమ్మగారి మనవడు వంటి ఆణిముత్యాలు ఎన్నో ఉన్నాయి.

విజయా వారి మిస్సమ్మ సినిమాలో ప్రధాన పాత్రకు మొదట భానుమతినే తీసుకున్నారు. అయితే షూటింగు మొదలైన తర్వాత చక్రపాణికి ఆమె వ్యవహార శైలి నచ్చక ఆమె స్థానంలో సావిత్రిని తీసుకున్నారు.

ఈ సంగతి గురించి ప్రస్తావిస్తూ భానుమతి ఏటా తాను వరలక్ష్మీ వ్రతం చేసుకుంటాను కనుక ఒక గంట లేటుగా వస్తానని ముందు రోజు చెప్పినా అధికారపూర్వకంగా చక్రపాణి నొప్పించారని రాసుకున్నారు. సావకాశంగా ఆలోచిస్తే చక్రపాణి తప్పేముంది నా సమయం బాగోలేదేమోనని భావించినట్టుగా వివరించారు.

ఆ సినిమా విడుదలై, ఘన విజయం సాధించాక భానుమతి నేను మిస్సమ్మలో నటించక పోవడం వల్ల సావిత్రిలాంటి గొప్పనటి వెలుగులోకి వచ్చింది, అని సంతోషించిందిభానుమతి కేవలము నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలు అందుకున్నది.

ఓ గాయనిగా, సంగీత దర్శకురాలిగా, స్టూడియో యజమానిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా పలు పాత్రలు సమర్ధవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకున్నది

భానుమతి గారి అవార్డులు
  • 1956 లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
  • మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకు)
  • అన్నాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
  • తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
  • 1966లో ఆమె వ్రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి, భారత ప్రభుత్వము ఈమెను సత్కరించింది.
  • ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
  • 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది.
  • 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడు లోని ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
  • బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984 ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
  • 1984లో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
  • 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.

  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలయిన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలాబిళ్ళలలో ఒకటి భానుమతి ది.

భానుమతి గారి రచనలు
  • అత్తగారి కథలు
  • నాలో నేను
  • అత్తగారూ, నక్సలైట్లూ
  • భానుమతి కథానికలు

భానుమతి రామకృష్ణ గారి సినిమాల జాబితా:
  • పెళ్ళికానుక (1998) సావిత్రమ్మగా నటన
  • చామంతి (1992)
  • చెంబరుతి (1992)
  • పెద్దరికం (1992) అడుసుమిల్లి బసవపున్నమ్మ గానటన
  • సామ్రాట్ అశోక్ (1992)
  • బామ్మ మాట బంగారు బాట (1990)
  • అన్నపూర్ణమ్మగారి అల్లుడు (1988)
  • అత్తగారూ స్వాగతం (1988)
  • ముద్దుల మనవరాలు (1986)
  • మంగమ్మగారి మనవడు (1984) మంగమ్మ గా నటన
  • గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  • మనవడి కోసం (1977)
  • అమ్మాయి పెళ్ళి (1974)
  • తాతమ్మ కల (1974)
  • విచిత్ర వివాహం (1973)
  • అంతా మన మంచికే (1972)
  • మట్టిలో మాణిక్యం (1971)
  • గృహలక్ష్మి (1967)
  • పల్నాటి యుధ్ధం (1966) నాగమ్మ గా నటన
  • అంతస్తులు (1965)
  • తోడు నీడ (1965)
  • బొబ్బిలి యుధ్ధం (1964) మల్లమ్మ గా నటన
  • వివాహ బంధం (1964) భారతిగా నటన
  • పెంచిన ప్రేమ (1963)
  • బాటసారి (1961)
  • అంబికాపతి (1957) రాకుమారి అమరావతిగా నటన
  • నల దమయంతి (1957) దమయంతిగా నటన
  • సారంగధర (1957) చిత్రాంగి గా నటన
  • వరుడు కావాలి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956/I) రంగసాని గా నటన
  • చింతామణి (1956) .... చింతామణి గా నటన
  • మధురై వీరన్ (1956) .... రాకుమారి బొమ్మి గా నటన
  • రంగూన్ రాధ (1956) ....
  • తెనాలి రామన్ (1956) .... రంగసాని గా నటన
  • అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ (1955) గా నటన
  • కల్వనిన్ కథలి (1955) .... కళ్యాణిగా నటన
  • విప్రనారాయణ (1954) .... దేవదేవిగా నటన
  • అగ్గి రాముడు (1954)
  • చక్రపాణి (1954)
  • మలైకళ్ళన్ (1954)
  • చండీరాణి (1953/I) .... చండీరాణిగా నటన
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952) .... మోతి గా నటన
  • మల్లీశ్వరి (1951) .... మల్లీశ్వరిగా నటన
  • మంగళ (1951) .... మంగళ గా నటన
  • మాయా రంభ (1950)
  • అపూర్వ సహోదరులు (1950) .... రంజన గా నటన
  • లైలామజ్ఞు (1949/I) .... లైల గా నటన
  • రక్షరేఖ (1949) .... రాకుమారి కళావతి గా నటన
  • నల్లతంబి (1949) .... పుష్పగా నటన
  • రత్నమాల (1947) .... రత్నమాల గా నటన
  • గృహప్రవేశం (1946) .... జానకి గా నటన
  • స్వర్గసీమ (1945) .... సుబ్బి/సుజాత దేవి గా నటన
  • తాసీల్దార్ (1944) .... కమల గా నటన
  • గరుడ గర్వభంగం (1943)
  • కృష్ణ ప్రేమ (1943) .... చంద్రవల్లి గా నటన
  • భక్తిమాల (1941) .... రాధ గా నటన
  • ధర్మపత్ని (1941/I)
  • ధర్మపత్ని (1941/II)
  • మాలతీమాధవం (1940)
  • వర విక్రయం (1939) .... కాళింది గా నటన
  • పెళ్ళికానుక (1998)
  • బామ్మమాట బంగారుబాట (1990)
  • ముద్దుల మనవరాలు (1986)
  • మంగమ్మగారి మనవడు (1984)
  • గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  • మట్టిలో మాణిక్యం (1971)
  • పల్నాటి యుధ్ధం (1966)
  • అంతస్తులు (1965)
  • తోడు నీడ (1965)
  • బొబ్బిలి యుధ్ధం (1964)
  • వివాహబంధం (1964)
  • బాటసారి (1961)
  • నల దమయంతి (1957)
  • వరుడు కావాలి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956/I)
  • చింతామణి (1956)
  • విప్రనారాయణ (1954)
  • అగ్గిరాముడు (1954)
  • చక్రపాణి (1954)
  • చండీరాణి (1953/I)
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952)
  • మల్లీశ్వరి (1951)
  • మంగళ (1951)
  • అపూర్వ సహోదరులు (1950)
  • లైలామజ్ఞు (1949/I)
  • రాజశేఖర (1949)
  • రత్నమాల (1947)
  • స్వర్గసీమ (1945)
  • తాసీల్దార్ (1944)
  • గరుడ గర్వభంగం (1943)
  • కృష్ణ ప్రేమ (1943)
  • ధర్మపత్ని (1941/I)
  • వరవిక్రయం (1939)
భానుమతి రామకృష్ణ దర్శకురాలిగా చిత్రాలు:
  • అసాధ్యురాలు (1993)
  • పెరియమ్మ (తమిళం) (1992)
  • భక్త ధృవ మార్కండేయ (1982/I)
  • భక్త ధృవ మార్కండేయ (1982/II)
  • ఒకనాటి రాత్రి (1980)
  • రచయిత్రి (1980)
  • మనవడి కోసం (1977)
  • వాంగ సంభందీ వాంగ (తమిళం) (1976)
  • ఇప్పడియుమ్ ఒరు పెన్ (తమిళం) (1975)
  • అమ్మాయి పెళ్ళి (1974)
  • విచిత్ర వివాహం (1973)
  • అంతా మన మంచికే (1972)
  • గృహలక్ష్మి (1967)
  • చండీరాణి (1953/I)
నిర్మాత గా భానుమతి రామకృష్ణ గారు
  • బాటసారి (1961)
  • వరుడు కావాలి (1957)
  • చింతామణి (1956)
  • విప్రనారాయణ (1954)
  • చక్రపాణి (1954)
  • చండీరాణి (1953/I)
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952)
  • లైలామజ్ఞు (1949/I)
  • రత్నమాల (1947)
భానుమతి గారు సంగీత దర్శకురాలిగా
  • చింతామణి (1956)
  • చక్రపాణి (1954)

ఈ క్రింది వీడియో లింకులతో ఈమె బయోగ్రఫీ తెలుసుకోండి...










నోట్: 

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

నా ఇంకో బ్లాగ్ https://notlimitedmusic.blogspot.com like,share and subscribe  చేయండి

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...