19, డిసెంబర్ 2020, శనివారం

ప్రసిద్ధ టీవీ యాంకర్ ఉదయ భాను బయోగ్రఫీ చలన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం

ప్రసిద్ధ టీవీ యాంకర్ ఉదయ భాను బయోగ్రఫీ చలన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం

ఉదయ భాను ఒక భారతీయ యాంకర్  మరియు సినీ నటి, తెలుగు టెలివిజన్ షోలలో తన స్క్రిప్ట్ రచనలకు, వ్యాఖ్యలకు  మంచి పేరు తెచ్చుకుంది.

ఉదయ భాను జన్మ వివరాలు: 

  • ఉదయ భాను భారతదేశంలోని తెలంగాణలోని కరీంనగర్ లోని సుల్తానాబాద్ లో జన్మించారు. 

  • ఆమె తండ్రి ఎస్. కె. పటేల్ ఒక వైద్యుడు మరియు ఆమె తల్లి అరుణ ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు ఒక సోదరుడు ఉన్నారు. 

  • ఆమె తండ్రి  కవిగా పనిచేశారు. ఆమె తండ్రి ఉదయ భానుకు అతని కలం పేరు పెట్టుకున్నారు. 

  • ఉదయ భానుకు నాలుగు (4) సంవత్సరాల వయసులో నే ఆమె తండ్రి మరణించాడు.  

  • ఉదయ భాను తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది ఆమెకు ఏడుగురు పిల్లలు పుట్టారు. 

  • ఆమె తన తల్లితో గొడవపడి తన తల్లిని విడిచిపెట్టింది. 

  • ఉదయభాను  విజయ్ కుమార్ ను 2004 లో వివాహం చేసుకుంది.

  • ఉదయభాను కవల కుమార్తెలకు  2 సెప్టెంబర్ 2016 న జన్మనిచ్చారు.

  • ఉదయభాను  తన టీవీ కెరీర్ లో జూనియర్ శ్రీదేవి గా పేరు పొందింది .

👉 ఉదయ భాను ఆర్. నారాయణ మూర్తి యొక్క ఎర్రా సైనం (1990) లో 12 సంవత్సరాల వయసులో నటించారు.

👉 కొండవీటి సింహాసనమ్ (2002), ఖైదీ బ్రదర్లు  (2002) మరియు శ్రావణ మాసం (2005) తో సహా మరికొన్ని తెలుగు చిత్రాలలో ఆమె నటించింది. 

👉 ఆమె రెండు కన్నడ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది మరియు విడుదల చేయని తమిళ చిత్రం చిన్న రామసామి పెరియ రామసామిలో జయరామ్ కలిసి ఆర్. వి. ఉదయకుమార్ నటించారు.

👉 ఆమె మూడు తెలుగు చిత్రాలలో ఆపద మొక్కులవాడు (2008), లీడర్ (2010) మరియు జులాయ్ (2012) లలో  ప్రదర్శించింది. 

హోస్టుగా చేసినవి  : 

  • ఒన్సు మోర్ ప్లీజ్  జెమినీ టీవీ . Gemini TV

  • సాహసం చేయరా డింభకా  జెమినీ టీవీ  Gemini TV

  • జాణవులే నెరజాణవులే   జెమినీ టీవీ for Gemini TV

  • నువ్వు నేను  జెమినీ టీవీ   Gemini TV

  • లక్కసు (LUX) డ్రీం గర్ల్   జెమినీ టీవీ Gemini TV

  • ఛాంగురే బంగారు లేడి  జెమినీ టీవీ Gemini TV

  • లక్కీ లక్ష్మి  జెమినీ టీవీ Gemini TV

  • డాన్సుఇంగ్ స్టార్లు  జెమినీ టీవీGemini TV

  • గోల్డ్ రష్  (సీసన్ 1) జీ తెలుగు  Zee Telugu

  • తీన్మార్  జీ తెలుగు  Zee Telugu

  • మగధీర  జీ తెలుగుZee Telugu

  • రేలా రే రేలా  మా టీవీ  MAA TV

  • రంగం (సీసన్  -1 & 2)మా టీవీ  MAA TV

  • ఢీ  (1నుండి  6 సీసన్లు ) ఈ టీవీ తెలుగు  ETV Telugu

  • పిల్లలు పిడుగులు జెమినీ టీవీ  Gemini TV

  • అంతఃపురం జెమిని టీవీ  Gemini TV

  • నీతోనే డాన్ సు స్టార్ మా టీవీ  Star Maa

  • కళ్యాణ  లక్ష్మి జెమినీ టీవీ Gemini TV

  • గ్యాంగ్ లీడర్  ఈ టీవీ ప్లస్  ETV Plus

జడ్జీ గా  చేసినవి  : 

  • అదుర్స్  ఈటీవీ తెలుగు  ETV Telugu

  • తడాఖా ఈటీవి తెలుగు  ETV Telugu

  • జూ ల క ట క  జెమిని టీవీ Gemini TV

అవార్డు :

  • గోల్డెన్ లేడీ టీవీ అవార్డు 

  • అప్సర  అవార్డులు  జీ తెలుగు టీవీ వారు 2017 లో అందించారు.

ఉదయభాను నటించిన చిత్రాలు :

  • 1994 లో ఎర్ర సైన్యం తెలుగు లో 
  • 1995 లో వేటగాడు తెలుగు లో 
  • 1997 Aliya Alla Magala Ganda కన్నడ చిత్రం 
  • 1997 ఖైదీ బ్రదర్ స్  తెలుగు చిత్రం 
  • 2002 కొండవీటి సింహం తెలుగు చిత్రం 
  • 2002 పోలీస్ నెంబర్ -1 తెలుగు చిత్రం 
  • 2003 బస్తీమే సవాల్  తెలుగు చిత్రం 
  • 2005శ్రావణ మాసం తెలుగు చిత్రం 
  • 2008 ఆపద మొక్కుల వాడ తెలుగు చిత్రం 
  • 2010 లీడర్ తెలుగు చిత్రం 
  • 2012 జులాయి తెలుగు చిత్రం 
  • 2013 మధుమతి తెలుగు చిత్రం

ఉదయభాను  వీడియో యు .ఆర్. యల్. ల లో ఆమె వీడియో లు చూడండి...



Anchor Udaya bhanu biography | RECTVINDIA - YouTube



Udaya Bhanu Real Life Story - YouTube



Telugu Anchor Udaya Bhanu Biography ... - YouTube



Anchor Udaya Bhanu Real Life Story - YouTube



ఈ రోజు సూక్తి :

"Character cannot be developed in ease and quiet. Only through experience of trial and suffering can the soul be strengthened, ambition inspired, and success achieved."

-Helen Keller

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.




30, అక్టోబర్ 2020, శుక్రవారం

భారతీయ పాత చలన చిత్ర నటీమణి పద్మిని గురించి తెలుసుకుందామా?

భారతీయ పాత చలన చిత్ర నటీమణి పద్మిని గురించి తెలుసుకుందామా?



👉జీవించిన కాలం 12 జూన్ నుంచి 24 సెప్టెంబర్ 2006 వరకు 74 సంవత్సరాలు 

👉తల్లితండ్రులు : సరస్వతి అమ్మ (తల్లి), తఙ్కప్పం పిళ్ళై (తండ్రి ) 

👉భర్త పేరు రామ చంద్రన్  (1961-1981)   

👉సోదరి మణులు : లలిత, రాగిణి )

👉అవార్డులు : బెస్ట్ సపోర్టింగ్ నటీమణి  (1966) లో  పొందారు ,

👉నామినేషన్లు : ఫిలిం ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ (1962) లో మరియు ఫిలిం ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (1966)

  • పద్మిని ప్రముఖ సినిమా నటి, నర్తకి. ఈమె భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె, ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారు.
  • ఈమె 1932, జూన్ 12వ తేదీన జన్మించింది. ఈమె తొలిసారి తన 14వయేట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. తరువాత 30 సంవత్సరాలు తెలుగు, తమిళ, హిందీ, మళయాల భాషలలో సుమారు 250 సినిమాలలో నటించింది.

  • ఈమె శివాజీ గణేశన్, ఎం.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావు, రాజ్‌ కపూర్, షమ్మీ కపూర్, ప్రేమ్‌ నజీర్, రాజ్‌కుమార్, జెమినీ గణేశన్ వంటి పెద్ద నటులతో కలిసి నటించింది. ఎక్కువగా శివాజీ గణేశన్‌తో 59 చిత్రాలలో నటించింది.

  • ఈమె అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టరును 1961లో వివాహం చేసుకుని తాత్కాలికంగా నటనకు విరామం ఇచ్చి కుటుంబ జీవితంపై, భరతనాట్యంపై దృష్టిని కేంద్రీకరించింది.

  • 1977లో న్యూ జెర్సీలో శాస్త్రీయ నృత్యశిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అనే పేరుతో ఒక డ్యాన్సు స్కూలును ప్రారంభించింది. ప్రస్తుతం ఈ స్కూలు అమెరికా లోని భారత శాస్త్రీయ నృత్య శిక్షణా సంస్థలలో అతి పెద్దదిగా పేరు పొందింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు.

  • ఈమె చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2006, సెప్టెంబరు 24 తేదీన గుండెపోటుతో మరణించింది.

ఈమె నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం

సినిమా పేరు

ఇతర నటులు

దర్శకుడు

1950

తిరుగుబాటు

సి.హెచ్. నారాయణరావు, శాంతకుమారి

పి.పుల్లయ్య

1950

బీదలపాట్లు

చిత్తూరు నాగయ్య, లలిత

కె.రామనాథ్

1951

ఆడ జన్మ

సి.హెచ్. నారాయణరావు, బి.ఎస్.సరోజ

జి.ఆర్. రావు

1951

చంద్రవంక

కాంచన్, కనకం


1951

పెళ్లికూతురు

ఎన్.ఎస్.కృష్ణన్, లలిత

ఎన్.ఎస్.కృష్ణన్

1952

కాంచన

కె.ఆర్.రామస్వామి, లలిత

ఎస్.ఎం.శ్రీరాములు

1952

ధర్మ దేవత

శాంతకుమారి, రేలంగి వెంకట్రామయ్య

పి.పుల్లయ్య

1952

సింగారి

టి.ఆర్.రామచంద్రన్, లలిత, రాగిణి


1953

అమ్మలక్కలు

ఎన్.టి.రామారావు, లలిత

డి.యోగానంద్

1953

ఒక తల్లి పిల్లలు

టి.ఎస్.దొరైరాజు, లలిత

ఎ.ఎన్.ఎ.స్వామి

1953

ప్రపంచం

చిత్తూరు నాగయ్య, జి.వరలక్ష్మి

ఎస్.ఎల్.రామచంద్రన్

1954

అమర సందేశం

అమర్‌నాథ్, శ్రీరంజని

ఆదుర్తి సుబ్బారావు

1955

అంతా ఇంతే

శివాజీ గణేషన్, లలిత, రాగిణి

ఆర్.ఎం.కృష్ణస్వామి

1955

విజయగౌరి

ఎన్.టి.రామారావు, లలిత, రాగిణి

డి.యోగానంద్

1956

అమరజీవి

శివాజీ గణేషన్, సావిత్రి

టి.ప్రకాశరావు

1956

సాహస వీరుడు

ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి

డి.యోగానంద్

1958

వీరప్రతాప్

శివాజీ గణేశన్

టి.ప్రకాశరావు

1959

గొప్పింటి అమ్మాయి

శివాజీ గణేశన్, రాజసులోచన


1959

వీరపాండ్య కట్టబ్రహ్మన

శివాజీ గణేశన్, ఎస్.వరలక్ష్మి

బి.ఆర్.పంతులు

1960

దేసింగురాజు కథ

ఎం.జి.రామచంద్రన్, పి.భానుమతి

పి.ఆర్.రఘునాథ్

1961

అనుమానం

శివాజీ గణేశన్

కృష్ణన్ - పంజు

1961

కత్తిపట్టిన రైతు

ఎం.జి. రామచంద్రన్

ఎ.ఎస్.ఎ.స్వామి

1961

కన్యకా పరమేశ్వరీ మహత్మ్యం

శివాజీ గణేశన్

ఎ.ఎస్.ఎ.స్వామి

1961

మాయా మశ్చీంద్ర

నిరూపా రాయ్

బాబూభాయ్ మిస్త్రీ

1962

ఏకైక వీరుడు

ఎం.జి.రామచంద్రన్, అంజలీదేవి

నటేశన్

1962

స్త్రీ జీవితం

శివాజీ గణేశన్, రాగిణి

ఆర్.ఎస్.మణి

1963

రాణీ సంయుక్త

ఎం.జి.రామచంద్రన్, రాగిణి

డి.యోగానంద్

1966

మోహినీ భస్మాసుర

ఎస్వీ.రంగారావు, కాంతారావు

బి.ఎ.సుబ్బారావు

1967

ముద్దు పాప

శివాజీ గణేశన్

కె.ఎస్.గోపాలకృష్ణ

1967

వసంత సేన

అక్కినేని నాగేశ్వరరావు

బి.ఎస్.రంగా

1968

విజయకోట వీరుడు

జెమినీ గణేశన్, వైజయంతిమాల

ఎస్.ఎస్.వాసన్

1969

రాజ్యకాంక్ష

జెమినీ గణేశన్, రాగిణి

జి.విశ్వనాథం


ఇతర విశేషాలు కబుర్లు పద్మిని గురించి

 

ఎవ్వలవు నన్రాగ నడనమాడుకిరీరిగళ్....ప్రమాదమా....నల్లా ప్రమాదమాప్పా....*......

నా ప్రక్కన కూర్చున్న అరవాయన...అరుస్తున్నట్లే అంటుంటే .... ఆ సంతోషం చూడాలి.

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో....

శోభానాయుడు & పార్టీ కూచిపూడి నృత్య రూపకం శ్రీనివాస కళ్యాణం....

చూస్తున్న నాకు ప్రక్కనే ఉన్న తమిళాయన....అడుగుతూనే ఉన్నాడు...చీటికీ మాటికీ....అర్తం ఎన్నా....ఇద ఏమి?....

ఇలా అడిగి మరీ తెలుసుకుని...చూసి ఆనందిస్తున్నాడు.

మందిరంలో జనం ఆట్టే లేరు! మన వారి స్పందన కూడా అంతంత మాత్రమే! ఆశ్చర్యం....

మన తెలుగు వారి కూచిపూడి చూచి.... ఆనందించే తెలుగు వారు అప్పుడు (1989) అంతంత మాత్రమే తిరుపతిలో!

ఇదే నృత్యరూపకం...1988 డిసెంబర్ లో అనంతపురం లో చూచాను. అబ్బురమనిపించింది. ప్రజలు కూడా కిటకిట లాడారు. మంచి అప్లాజ్ కూడా!

ఎన్.టి.ఆర్. ముఖ్యమంత్రిగా ఉండగా....హిందూ ధర్మ ప్రచార పరిషత్ క్రింద....టి.టి.డి. వారు స్పాన్సర్ చేయగా....ఈ శ్రీనివాస కళ్యాణం..... శోభానాయుడు & బృందం....ఆంధ్ర ప్రదేశ్ లోని పట్టణాలన్నింటా ప్రదర్శించారు.

ప్రదర్శనలో...ఎటువంటి తేడా లేదు. ప్రజాకర్షణ లోనే ఉండేది తేడాలు!

***************

1989 లోనే ఇలా ఉంటే....ఇప్పుడసలు చెప్పేదేముంది!

ఇరుక్కుపో హత్తుకుని వీర వీర...కొరుక్కుపో నీతనివి తీరతీర... అంటూ....

నాభి ఉన్న నడుమును...ప్రక్కలకు....జఘన బాగాన్ని....ముందుకు వెనక్కు ....ఊపితే చాలు. ఆ ఊపుతో ....థియేటర్ అంతా ఊగుతుంది!

ఒక్క వ్యాంపులే కాదు. కథానాయికలు కూడా ఇంతే! ఒట్టి కామ కవాతులే!

అవి తప్ప...ఇంకేం రావసలు వీళ్ళకు! వీళ్ళకు కోట్లు నజరానా సమర్పించి ఆడిస్తారు దర్శకులు - నిర్మాతలు!

ఆ కాలం నాడే కాస్త నయం...

డాన్సులు ఆట్టే రాని నాయికలు...సావిత్రి, భానుమతి, అంజలి, జమున, కృష్ణకుమారి,వాణిశ్రీ, బి.సరోజాదేవి....లాంటి వారితో కూడా నయన మనోహరంగా నర్తింప చేశారు.

జోహారు శిఖిపింఛమౌళి.....పాట కోసం....హేమ మాలిని 5 లక్షలు పారితోషికం తీసుకుందని...ఆ రోజుల్లో పెద్ద టాక్!

నిజానికి ఆ పాటలో కూడా అంతటి నర్తకీమణి చేసినది ప్యూర్ క్లాసికల్ కాదు! సినిమాకి తగ్గట్లు కాస్త స్పీడ్ గా చేపిస్తారు. లేకపోతే మనకు పట్టదసలు!

స్పానిష్ ఫ్లెమెంకో, రష్యన్ బాలే, క్యూబాలో సల్సా,అర్జెంటైనాలో టాంగో, జపాన్ లో కబుకి.....ఒక్కో దేశంలో ఒక్కో నృత్య రీతులున్నాయి.

మనకు...బోలెడు...కథక్, కథాకళి, మణిపురి, ఒడిస్సీ, కూచిపూడి, భరత నాట్యం,మోహినీయాట్టం,.....ఎన్నో నృత్య రీతులున్నా....ఇప్పుడు సినీ వెండి తెర ను ఏలుతున్నది మాత్రం.....కామ కవాతు నృత్యాలు.

****************

*ఏం పప్పీ.....ఇంకా ఈ సినిమాల మోజు తీరలేదా....

హాయిగా న్యూజెర్సీలో పెద్ద డాన్స్ స్కూల్ నడుపుతున్నావు. వారు డాక్టర్. ఒకే ఒక కొడుకు...హాయిగా ఉండక...మళ్ళీ...వచ్చావేంటి?.....

అప్పటిలా...లేదిప్పుడు ఇండస్ట్రీ....ఆ ఆప్యాయతలు....అనుబంధాలు లేవు.

అంతా కృత్రిమం! నూవ్విక్కడ ఉండలేవు*......

శివాజీ గణేశన్.....పద్మిని గారితో అన్న మాటలివి.1985 లో పూవే పూచూడవే....మూవీ కోసం పద్మిని గారిని....ఓ ముఖ్యమైన పాత్ర కోసం రప్పించారు న్యూజెర్సీ నుండి. అదే తెలుగు లో కూడా తీశారు భానుమతి & సుహాసిని లతో.

*ఇక్కడే ఉండిపోవడానికి రాలేదులే....నాకు నా స్కూల్ ముఖ్యం. దాన్నొదిలి ....నేనెక్కడికీ రాను. ఈ పాత్ర మంచిదని....ఒప్పించి పిలిపించారు. నదియా కూడా మంచి అమ్మాయి. నటన నాకెంతో ఇష్టం...నా బలహీనత...అందుకే ఒప్పుకున్నా. అయినా...మీ అందరినీ కలిసాను కదా....ఈ వంకతో!*.....

శివాజీ గణేశన్ కు ఎదురు సమాధానం చెప్పింది. ఇద్దరూ కలిసి షుమారు 60 సినిమా లలో హీరో హీరోయిన్లు గా నటించారు. 1950, 60& 70 లలో బాగా పేరెళ్ళిపోయిన యాక్ట్రెస్ & డాన్సర్ శ్రీమతి. పద్మిని.

****************

*ఏమిటో....అంతా కలలా గడిచిపోయినట్లుంది. నాకంటే 5ఏళ్ళ చిన్నది రాగిణి 39 ఏళ్ళకే కేన్సర్ పాల బడింది.

నాకంటే 2 ఏళ్ళు పెద్దదైన లలితక్క కూడా కేన్సర్ తోనే 51 ఏళ్ళకే...వెళ్ళిపోయింది!*

*అబ్బా...పప్పీ...నువ్వూ వేదాంత ధోరణిలోకెళ్ళావా! ఎవరికెంత ప్రాప్తమో అంతే!*.....

అయినా...ట్రావెంకూర్ సిస్టర్స్ గా మీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. మెరుపు తీగ లా నృత్యం చేసే నీకు ఈ ధోరణి సూట్ కాదులే పప్పీమ్మా!*...



అంటున్న శివాజీ గణేశన్ తో పద్మిని....

*నిజమే....అదో వైభవం. ఆ ప్రాభవం....అమోఘం. గతం గతహ! అన్నట్లు...శోభన మా బ్రదర్ చంద్రకుమార్ కూతురే....ఇప్పుడు హీరోయిన్ గా నటిస్తుంది. మా లాగే భరత నాట్యం లో అందె వేసిన చెయ్యి...అయ్యింది. రియల్లీ...అయాం ప్రౌడ్ ఆఫ్ హర్.*


*యస్. షి ఈజ్ వెరీ టాలెంటెడ్. ఐ హావ్ సీన్ హర్ ఇన్ లేటెస్ట్ మూవీస్..పప్పీమ్మా!షి విల్ బి హావింగ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఎహెడ్!.....

****************


అయినా ఇప్పుడు కరోనా దెబ్బ...ఇప్పుడెలా నృత్యాలు తీస్తారో చూడాలి...మాస్కులు వేసుకుని!

****************


లలిత, పద్మిని& రాగిణి - ట్రావెంకూర్ సిస్టర్స్ గా భరత నాట్యం లో విశేష ఖ్యాతి గాంచిన వీరిలో పద్మిని మరీ ఫేమస్.


నాట్యంలో ముగ్గురూ అఖండులే అయినా...ముఖారవిందం మరింత బాగుండి...నటనా పటిమ బాగుండటం తో....పద్మిని షుమారు 250 మూవీస్ లో నటించారు తమిళ, మళయాళ, తెలుగు, కన్నడ & హిందీ భాషలలో కలిపి.


ఒక్క శివాజీ గణేశన్ తోనే 60 మూవీస్, ఎం.జి.ఆర్ తో 25 & జెమినీ గణేశన్ తో 17 మూవీస్ చేసిన ఘనత పద్మిని సొంతం!


తిల్లానా మోహనాంబాల్......ఓ నృత్య ప్రధానమైన...నాదస్వర యుతమైన...సంగీత భరిత కావ్యం.

1947 నుండి నర్తిస్తూ...నటిస్తున్నా...జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకున్నారు పద్మిని.


అమెరికా లో వైద్యులు...రామనాథన్ ను 1961 లో వివాహమాడి...1963 లోనే ఓ బిడ్డకు తల్లి అయి....సినిమాల నుండి కొంత బ్రేక్ తీసుకున్నా...యాక్ట్ చేస్తూనే....జీవితాన్ని బాలెన్స్ చేయడం....శ్రీమతి. పద్మిని గారికే చెల్లింది!*


1977 లో న్యూజెర్సీ లో భరతనాట్యం స్కూల్ ప్రారంభించి.....తన తదనంతరం కూడా ఆ స్కూల్ నడిచేలా ఏర్పాటు చేసుకున్నారు.


ఇప్పటికీ...ఆ డాన్స్ స్కూల్ ప్రఖ్యాతి చెందినదే న్యూజెర్సీ లో!


4 ఏళ్ళ నుండే కథాకళి...భరత నాట్యాల నభ్యసిస్తూ....10 ఏళ్ళకే అరంగేట్రమిచ్చిన పద్మిని......


16 ఏళ్ళకే ఉదయశంకర్ తీసిన నృత్యప్రధాన చిత్రం కల్పన లో నర్తించారు. ఆ అద్భుత కళాఖండం....ఇప్పుడు ఆర్కైవ్స్ లో కూడా దొరకడం లేదు!*


హిందీ లో మేరా నాం జోకర్, జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై, ఆషిక్....లాంటి మూవీస్ లో నటించారు.


వైజయంతిమాల కు పోటీ అంటే....ఒక్క పద్మిని మాత్రమే....అన్నట్లు...సాగింది...వారిరువురి సినీ నర్తన!


ఇద్దరూ ప్రతిభాశాలులే. వారిరువురూ...నాట్యం చేస్తుంటే....(వంజికోట్టై వాలిబన్) రెండు మెరుపు తీగలు భువి పై....నృత్యం చేస్తున్నట్లే ఉండేది.


వారప్పుడు చేసిన....ఆ నృత్యం....ఈ మధ్య కొత్త అమ్మాయిలు....చేసిన నృత్యం చూసి ఆశ్చర్య పోయాను. ఎంత బాగా చేశారో మీరూ చూడండి!*


12-6- 1932 లో జన్మించిన శ్రీమతి. పద్మిని....24-9- 2006 లో కీర్తి శేషులయ్యారు. కొన్ని అపూర్వమైన వారి నృత్యాలు ఈ రోజు మనం వీక్షిద్దాం మరి రండి .*


పద్మిని పాటలు నృత్యాలు వీడియో యు . ఆర్. యల్ లు చూడండి

కణ్ణుం..కణ్ణుం కళందు.......వంజికోట్టై వాలిబన్(1958).

https://youtu.be/x2QZeL69DiI

కణ్ణుం కణ్ణుం కళందు.............బై........సిమ్రాన్ & అర్చన.

https://youtu.be/yJYigwCKqMI

నీదేగా నీదేగా...తనువు హృదయము నీదేగా.........రాగాలు - అనురాగాలు.

https://youtu.be/XVWDtwmaLRs

పద్మిని & రాగిణిల నృత్యం..........కల్పన.

https://youtu.be/_O_i48333qw

పల్లవి పాడేనులే కోరి, మనసే శృతి చేసి.......శివభక్త విజయం.

https://youtu.be/HfMd_cLaFu4

విజయమిదుగో లభించేను......మోహినీ భస్మాసుర.

https://youtu.be/qARWoRzpOYI

తీయనైన ఊహల తేలి తేలి ఊగెద.......మోహినీ భస్మాసుర.

https://youtu.be/kDtybVjCaoo

అద్భుత నృత్య ప్రతిభా పద్మిని.........సరస్వతీ శపథం.

https://youtu.be/QHAJV9RaBJg

మరైందిరందే పార్కుం మర్మమెన్నే..........తిల్లానా మోహనాంబాల్.

https://youtu.be/Cz1s8FSQF54

నలందానా...నలందానా...........తిల్లానా మోహనాంబాల్.

https://youtu.be/T93njWVO48s

లతామంగేష్కర్ గానానికి........శివ్ భక్త్ మూవీకై....పద్మిని నృత్యం.(1955)

https://youtu.be/xbWvkXAi9MY

పద్మిని - ఎం.జి.ఆర్ ల పోటీ నృత్యం..........మన్నది మన్నన్

(1960).

https://youtu.be/_Trh0tt7w1E

ఆడినాల్ నటనం ఆడినాల్......మరగదం(1959).

https://youtu.be/Z0b_kYZC5UA

లతా మంగేష్కర్ గానానికి పద్మిని నృత్యం.........పరదెశి(1957).

https://youtu.be/PrZHRpUN3kE

తిరైపోట్టు నామే........రాజా రాణి.

https://youtu.be/hho5gqwZaRY

వెన్నిలవే తన్మదియే......వంజికోట్టై వాలిబన్.

https://youtu.be/zMoSkoxBK3E

పూవే పూచూడవా.........పూవే పూచూడవే(1985)

https://youtu.be/-M_0hg_kDKk

హొ మైనే ప్యార్ కియా......జిస్ దేశ్ మే గంగా బెహతీ హై.

https://youtu.be/mJ-C2ourOrs

లొ ఆయీ మిలన్ కీ రాత్........ఆషిక్.

https://youtu.be/QvC0XWcMcGo

ఓ బసంతి పవన్ పాగల్.......జిస్ దేశ్ మే గంగా బెహతీ హై.

https://youtu.be/K9Caih79_rs

అంగ్ లగ్ జా బాల్ మా..........మేరా నాం జోకర్.

https://youtu.be/JxLaC42BQVM

తమిళ మిత్రులకోసం....కీ.శే. పద్మిని గారి ఇంటర్వ్యూ.

https://youtu.be/Rh1TaM09hdw

https://youtu.be/sbzd0XwWqDA

Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.


పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...