ప్రముఖ గాయకుడు ఎస్.పీ. బాల సుబ్రహ్మణ్యం జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామా
👉బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరునితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖ సుధాకర్ ను వివాహమాడింది. బాలు తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి 1987లో మరణించగా తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4 న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించింది
నటుడుగా అతని జీవితం :
👉నటుడిగా 1969లో పెళ్లంటే నూరేళ్ల పంట చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి, ప్రేమ, వివాహ భోజనంబు, కళ్లు, చెన్నపట్నం చిన్నోడు, ప్రేమికుడు, గుణ, పవిత్రబంధం, మిథునం, దేవస్థానం లాంటి చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. చివరిసారిగా దేవదాస్ చిత్రంలో నటించారు. నటుడిగానే కాకుండా సంగీత నేపథ్యం ఉన్న టెలివిజన్ షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు.
👉కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు.
👉2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన కింగ్ బెన్స్లే కు ఆయన డబ్బింగ్ చెప్పాడు.
అందుకున్న పురస్కారాలు
- భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. యస్ పి. బాల సుబ్రహ్మణ్యం సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.
- 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు.
- 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు
పద్మశ్రీ
- 👉2001 లో లభించింది
- 👉పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం (1999), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గవర్నరు రంగరాజన్ చేతులమీదుగా లభించింది
- 👉శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), కేంద్ర సమాచారా ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా లభించింది
- 👉2012 నంది పురస్కారాలు ప్రత్యేక బహుమతి (మిథునం)
సం|| | చిత్రం | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1969 | పెళ్లంటే నూరేళ్లపంట | తెలుగు | ||
1971 | మహమ్మద్ బీన్ తుగ్లక్ | తమిళం | Guest appearance | |
1972 | మహమ్మద్ బీన్ తుగ్లక్ | తెలుగు | Guest appearance | |
1981 | పక్కింటి అమ్మాయి | తెలుగు | బాలరాజు Bala Raju | |
1982 | Baalondu Chaduranga | కన్నడ | ||
మల్లె పందిరి | తెలుగు | షేక్ మోసెస్ మూర్తి Sheik Moses Murthy | ||
1983 | Tirugu Bhana | Kannada | Guest appearance in song "Idhe Naadu Idhe Baashe" | |
1987 | Manathil Uruthi Vendum | తమిళం | డాక్టర్,Doctor | |
1988 | ప్రేమ | తెలుగు | వెంకటేష్ అడ్వైసర్ Advisor to Venkatesh | |
వివాహ భోజనాలు | తెలుగు | Guest appearance | ||
కళ్ళు | తెలుగు | |||
1989 | చెన్నపట్నం చిన్నోళ్లు | తెలుగు | Himself | |
1990 | Keladi Kanmani | తమిళం | ఏ ఆర్. రంగరాజు A. R. Rangaraj | |
Palaivana Ragangal | తమిళం | |||
Thiyagu | తమిళం | |||
1991 | Sigaram | తమిళం | Damodar | |
1992 | Gunaa | తమిళం | Police officer | |
Palaivana Raagangal | తమిళం | |||
పర్వతాలు పానకాలు | తెలుగు | Paanakalu | ||
పెళ్లంటే నూరేళ్ళ పంట | తెలుగు | Chakravarthy | ||
Thalaivasal | Tamil | Shanmugasundaram | ||
Bharathan | Tamil | Ramkumar | ||
1993 | Thiruda Thiruda | Tamil | Lakshmi Narayanan CBI | |
Muddina Maava | కన్నడ | Ramayya | ||
1994 | Kadhalan | తమిళం | Kathiresan | |
1995 | రాజా హంస | తెలుగు | Doctor, a family friend | |
Paattu Padava | తమిళం | Murali | ||
1996 | Kadhal Desam | తమిళం | Divya's father | |
మైనా | తెలుగు | |||
పవిత్ర బంధం | తెలుగు | Viswanath | ||
Avvai Shanmughi | తమిళం | The family doctor and a relative | Guest appearance | |
Kandaen Seethayae | తమిళం | Police officer | unreleased | |
1997 | పెళ్లి వారమండి | తెలుగు | Hero's father | |
Prena | తెలుగు | |||
Ullaasam | తమిళం | Thangiah | ||
Ratchagan | తమిళం | LIC Padmanabhan | ||
Minsara Kanavu | తమిళం | Thangadurai | ||
Periya Manushan | తమిళం | Doctor | ||
Nandhini | తమిళం | Rangaswamy | ||
1998 | Sandhrba | కన్నడ | ||
ఊయల | తెలుగు | Doctor | ||
పెళ్ళాడి చూపిస్తా | తెలుగు | Himself | ||
Mangalyam Tantunanena | కన్నడ | Ravichandran's father | ||
Jolly | తమిళం | టీచర్ | ||
వైఫ్ ఆఫ్ వి వి. ప్రసాద్ | తెలుగు | వినీత్ తాత Vineeth's grandfather | ||
1999 | ఆరో ప్రాణం | తెలుగు | చంటి తండ్రి Chanti’s father | |
దీర్ఘ సుమంగళి | తెలుగు | Family friend to Dasari's family | ||
పాడుతా తీయగా | తెలుగు | హీరోయిన్ తండ్రి (Heera) | ||
పెద్ద మనసులు | తెలుగు | |||
Maya | తమిళం /తెలుగు /కన్నడ | |||
2000 | గొప్పింటి అల్లుడు | తెలుగు | యస్.వి.ఆర్. SVR | |
మనసు పడ్డాను కానీ | తెలుగు | రాశి తండ్రి Rasi's father | ||
దేవుళ్ళు | తెలుగు | |||
మెకానిక్ మావయ్య | తెలుగు | |||
Priyamaanavale | తమిళం | విశ్వనాధ్ Vishwanath | ||
2001 | చిరుజల్లు | తెలుగు | దుర్గ ప్రసాద్ Durga Prasad | |
2002 | ఇంద్ర | తెలుగు | As Himself | Cameo appearance |
పదహారేళ్ళ అమ్మాయి | తెలుగు | |||
April Maadhathil | తమిళం | As himself | Cameo appearance | |
2003 | Magic Magic 3D | తమిళం | ఆచార్యుడు Acharya | |
ఫూల్స్ | తెలుగు | Guest appearance | ||
Maha Yedabidangi | కన్నడ | |||
2006 | మాయ | తెలుగు | కుబేరుడుKubera | |
Roommates | తెలుగు | Himself | Cameo appearance | |
2007 | En Uyirinum Melana | తమిళం | విజయరంగం Vijayarangam | |
Kalyanothsava | కన్నడ | Army Captain | ||
Malle Pandiri | తెలుగు | |||
Hetthare Hennanne Herabeku | కన్నడ | Mesthru | ||
2010 | Naanayam | తమిళం | CEO Viswanath | |
2011 | Shakti | తెలుగు | విజయ రాయ Vijayaraya | |
2012 | Devasthanam | తెలుగు | సాంబమూర్తి Sambamurthy | |
Mithunam | తెలుగు | అప్ప దాసు Appa Dasu | ||
2014 | Thirudan Police | తమిళం | Professor | Guest appearance |
2015 | Moone Moonu Varthai | తమిళం | ||
మూడు ముక్కలాట | తెలుగు | |||
2018 | దేవిదాస్ | తెలుగు | చైర్మన్ సీతారామయ్య Chairman Seetharamayya | Cameo appearance |
సీరియల్ పేరు | భాష | ఇతర వివరాలు |
Nadhi Enge Pogiradhu | తమిళం | TV Serial |
Jannal-Adutha Veetu Kavithaigal | ||
Vaanam Paadi | Music show | |
పాడుతా తీయగా | తెలుగు | Music show |
పా డాలని ఉంది | ||
Endaro Mahanubhavulu | Serial | |
Ennodu Pattu Paadungal | తమిళం | Music show |
Edhe Thumbi Haaduvenu | కన్నడ | Music show |
Airtel supersinger, isaivanil ilayanila | తమిళం | Music show (Special Judge) |
Azhagu | TV serial (Special Appearance) |
సం|| | చిత్రం | భాష | నటుడు కి డబ్బింగ్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1981 | నాలుగు స్తంభాలాట | తెలుగు | నరేష్ | |
1982 | గాంధీ | తెలుగు (డబ్బింగ్ ) | బెన్ కింగ్స్లేయ్ Ben Kingsley | |
1983 | ఆనంద భైరవి | తెలుగు | గిరీష్ కామద్ Girish Karnad | |
1985 | Sippikkul Muthu | తమిళం | కమల్ హస్సన్ Kamal Haasan | తమిళ్ భాషకి మాత్రమే |
1988 | ఆడదే ఆధారం | తెలుగు | విసు Visu | |
1988 | శ్రీమతి ఒక బహుమతి | తెలుగు | విసు Visu | |
1988 | Sathya | తమిళం | కిట్టి Kitty | |
1988 | రుద్రవీణ | తెలుగు | జెమినీ గణేశన్ Gemini Ganesan | |
1990 | మైఖేల్ మధన కామరాజు | తెలుగు | కమల్ హస్సన్ Kamal Haasan | |
1990 | ఇల్లు ఇల్లాలు పిల్లలు | తెలుగు | విసు Visu | |
1991 | ఆదిత్య 369 | తెలుగు | టీను ఆనంద్ Tinu Anand | |
1996 | భామనే సత్యభామనే | తెలుగు | కమల్ హాసన్ Kamal Haasan | |
1997 | అన్నమయ్య | తెలుగు | సుమన్ Suman | |
1997 | ఇద్దరు | తెలుగు (డబ్బింగ్ ) | మోహన్ లాల్ Mohanlal | తమిళ్ భాషకి మాత్రమే Dubbed version of Tamil film Iruvar |
1998 | Harikrishnans | తమిళం (డబ్బింగ్ ) | మోహన్ లాల్ Mohanlal | మలయాళం చిత్రం హరికృష్ణాస్ కి Dubbed version of Malayalam film Harikrishnans |
2000 | శ్రీ సాయి మహిమ | తెలుగు | సాయి ప్రకాష్ Sai Prakash | |
2001 | అభయ్ | తెలుగు (డబ్బింగ్ ) | కమల్ హాసన్ Kamal Haasan | |
2003 | సత్యం శివమ్ | తెలుగు | కమల్ హాసన్ Kamal Haasan | |
2004 | శ్రీ ఆంజనేయం | తెలుగు | అర్జున్ షార్జా Arjun Sarja | |
2005 | అతడు | తెలుగు | నాస్సర్ Nassar | |
2005 | ముంబై ఎక్ష్ప్రెస్ | తెలుగు (డబ్బింగ్ ) | కమల్ హాసన్ Kamal Haasan | |
2008 | Slumdog Millionaire | తమిళం (డబ్బింగ్ ) | అనిల్ కపూర్ Anil Kapoor | |
2008 | Dasavathaaram | తెలుగు (డబ్బింగ్ ) | కమల్ హాసన్ Kamal Haasan | |
2008 | Kathanayakudu | తెలుగు | రజనీకాంత్ Rajinikanth | |
2010 | Manmadha Baanam | తెలుగు (డబ్బింగ్ ) | కమల్ హాసన్ Kamal Haasan | |
2012 | Sri Rama Rajyam | తమిళం (డబ్బింగ్ ) | నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna | తమిళ్ భాషకి మాత్రమే |