12, ఏప్రిల్ 2020, ఆదివారం

సుప్రసిద్ధ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి ఉపద్రష్ట సునీత గురించి తెలుసు కుందామా

సుప్రసిద్ధ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి ఉపద్రష్ట సునీత గురించి తెలుసు కుందామా
సునీత ఉపద్రష్ట 
ఉపద్రష్ట సునీత "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే సూపర్ హిట్ పాట పాడిన గాయని సునీత సుప్రసిద్ధ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. ఈమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. ఈమె 8 సంవత్సరాల కాలంలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది

వ్యక్తిగత వివరములు

• జననం ఉపద్రష్ట సునీత, 10 మే 1978, • గుంటూరు, ఆంధ్రప్రదేశ్• వృత్తి గాయని, డబ్బింగ్ కళాకారిణి• మతం హిందూమతం• జీవిత భాగస్వామి కిరణ్• పిల్లలు 2; ఆకాష్, శ్రేయ• తల్లిదండ్రులు ఉపద్రష్ట నరసింహారావు (తండ్రి), సుమతి (తల్లి)

జీవిత విశేషాలు
సునీత ఉపద్రష్ట నరసింహారావు, సుమతి (ఇంటిపేరు హరి) దంపతులకు జన్మించింది.
విద్యాభ్యాసం
ఈమె విద్యాభ్యాసం తన సొంత ఊరు గుంటూరు లోను, మరికొంత కాలం విజయవాడలోను చేసింది.
చిన్ననాటి నుండే సంగీతాన్ని అభిమానించి, ప్రేమించి విజయవాడలో సంగీత ద్రష్ట అయిన పెమ్మరాజు సూర్యారావు వద్ద కర్ణాటక సంగీతంలోను , కలగా కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతంలో 8 సంవత్సరాల పాటు శిక్షణ పొందినది. గురువుగారితో పాటు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పాల్గొనేది.
ఈమె 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు" అనే పాట పాడింది. ఈ పాట సూపర్ హిట్ అయ్యింది. తరువాత ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో సుమారు 3,000 సినిమా పాటలు పాడింది.
వివాహం
ఈమెకు 19 సంవత్సరాల వయసులో కిరణ్ తో వివాహమైనది. వీరికి ఇద్దరు పిల్లలు: అబ్బాయి ఆకాష్, అమ్మాయి శ్రేయ.
డబ్బింగ్ కళాకారిణి
ఉపద్రష్ట సునీత తమన్నా, అనుష్క, సౌందర్య, జెనీలియా, శ్రియా సరన్, జ్యోతిక, ఛార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక, మీరా జాస్మిన్, లైలా, స్నేహ, సొనాలి బింద్రె, కమలినీ ముఖర్జీ, కత్రినా కైఫ్ మొదలైనటువంటి వివిధ కళాకారులు కోసం గాత్రదానం (వాయిస్ ఓవర్) ఇచ్చారు.
డబ్బింగ్ కళాకారిణిగా ప్రఖ్యాతి పొందిన సినిమాలు

• ఠాగూర్ (జ్యోతిక కోసం)

• చూడాలని ఉంది (సౌందర్య కోసం)

• మనసంతా నువ్వే (తనూరాయ్ కోసం)

• జయం (సదా కోసం)

• ఇంద్ర (సోనాలి బింద్రే కోసం)

• ఒకరికి ఒకరు (ఆర్తి చాబ్రియా కోసం)

• నేనున్నాను (శ్రియ కోసం)

• ఆనంద్ (సినిమా) (కమలినీ ముఖర్జీ కోసం)

• మిస్టర్ అండ్ మిసెస్ శైలజ కృష్ణమూర్తి (లైలాకోసం)

• శ్రీ రామదాసు (కోసం స్నేహ)

• గోదావరి (కమలినీ ముఖర్జీ కోసం)

• హ్యాపీ డేస్ (తమన్నా కోసం)

• కంత్రి (సినిమా) (హన్సిక కోసం)

• సింహ (సినిమా) (నయనతార కోసం)

• శ్రీరామ రాజ్యం (నయనతార కోసం)

కొన్ని సినిమా పాటలు

1996 : ఊహా

2007 : గొడవ, చిరుత

2008 : పాండురంగడు : కోసల దేశపు కాంతలతో (పాట), గోరింటాకు, గమ్యం, కృష్ణార్జున : యమ రంజుమీద ఉంది పుంజు (పాట).

2009 : రైడ్, బోణీ, ఆ ఇంట్లో : హృదయ వేదన తెలుపనా ఈ క్షణం

2014 : నేరము శిక్ష
అవార్డులు
జాతీయ అవార్డులు

• విద్యార్థినిగా, ఉపద్రష్ట సునీత సాంస్కృతిక వ్యవహారాలు, మంత్రిత్వ (ప్రభుత్వ విభాగం) శాఖ, ఢిల్లీ వారి వద్ద నుండి, జానపద పాటలు కోసం ఢిల్లీలో మొదటి జాతీయ అవార్డు అందుకొంది, ఆమె 8 సంవత్సరాల వయస్సులో ఒక స్కాలర్షిప్ కూడా పొందింది.

• 1994: 15 సంవత్సరాల వయస్సులో 1994 సంవత్సరములో లలిత సంగీతం విభాగంలో ఆల్ ఇండియా రేడియో (All India Radio) నుండి నేషనల్ అవార్డు.

నంది పురస్కారాలు
1999 :
టెలివిజన్ చిత్రం అంతరంగాలు కోసం ఉత్తమ నేపథ్య గాయనిగా 1999 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు.
2002 :
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - జయం 2003 :
నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు - అతడే ఒక సైన్యం - నాపాట తేటతెలుగు పాట అనే పాట. 2004 :
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - ఆనంద్ (కమలినీ ముఖర్జీకి గాత్ర దానం చేసినందుకు) 2005 :
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - “పోతే పోనీ”. 2006 :
నంది ఉత్తమ నేపథ్య గాయనీమణులు - గోదావరి 2010 :
టెలివిజన్ చిత్రం అంతఃపురం కోసం 2010 సంవత్సరంలో ఉత్తమ నేపథ్యగాయనిగా నంది అవార్డు. 2011 :
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - దూకుడు 2012 :
నంది ఉత్తమ డబ్బింగ్ కళాకారిణులు - శ్రీరామరాజ్యం (సినిమా) - (నయనతారకి గాత్ర దానం చేసినందుకు)

ఫిలింఫేర్ అవార్డులు
• సినిమా పాట కోసం Cheluveye నిన్నే Nodalu "ఓ Priyathama" కన్నడలో (2010) - ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు
• సినిమా పాట "ఎం సందేహం లేదు " కోసం ఊహలు గుసగుసలాడే కోసం తెలుగు (2014) - ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డు
ఇతర అవార్డులు

• 1999 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 1999 సం.లో వంశీ బర్కిలీ అవార్డు.• 2000 : భరత ముని అవార్డు. (2000 సం.లో)• 2000 : ఉత్తమ నేపథ్య చిత్ర గాయనిగా 2000 సం.లో వార్త వాసవి అవార్డు.

ప్రదర్శనలు
• 3 సంల .వయస్సులో ఆమె మొదటి ప్రదర్శన ఇచ్చారు.
• 16 సంవత్సరాల వయస్సులో 1995లో ఆల్ ఇండియా రేడియో (AIR) లలిత (లైట్) సంగీతంలో ఆమె మొదటి కార్యక్రమం ఇచ్చింది.
• ఇప్పటివరకు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో (AIR), ఈ టివి (ETV), జెమిని టివి,, మా టివి లాంటి సంస్థలకు 500 వివిధ అనేక కార్యక్రమాలు పైగా ఇచ్చింది.
• స్వదేశంలోనే కాకుండా కువైట్, దుబాయ్, మలేషియా, సింగపూర్, లండన్, అమెరికా, ఫిలిప్పీన్స్, కెన్యా లాంటి మొదలైన విదేశాలలో కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చింది.
• `సౌత్ ఆఫ్రికాలో 2009 సం.లో, 'సునీతతో సంగీత మూమెంట్స్' అనే పేరుతో ఆమె సొంత ప్రదర్శనలు చేశారు.
• దాదాపు 750 సినిమాలు పైగా డబ్బింగ్ చెప్పింది.
• డబ్బింగ్ విభాగంలో అనేక అవార్డులు వచ్చాయి. ఇటీవల కాలంలో ఆమె సూపర్ సింగర్స్ 7 అనే తెలుగు టివి సీరియల్ కార్యక్రమ షో టైటిల్ను గెలుచుకుంది.
• తిరుమల తిరుపతి దేవస్థానము, తిరుపతిలో జరుగు బ్రహ్మోత్సవాల సమయములలో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు.
• ప్రభుత్వము వారు నిర్వహించే వివిధ కార్యక్రమములు అయిన, 200 సంవత్సరాల సికింద్రాబాదు లాంటి అనేక వేడుకల్లో పాల్గొన్నారు.
• అసెంబ్లీలో భారతదేశము స్వాతంత్ర్యం సాధించి 50 సంవత్సరాల సందర్భ వేడుకలు నిర్వహించింది.
• భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భ సందర్భంగా, ఆమె కాంగ్రెస్ ప్లీనరీ మీట్ వద్ద గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతో పాటు వందేమాతరం గీతాన్ని ఆలపించారు.

టెలివిజన్ కార్యక్రమములు

• ఉపద్రష్ట సునీత జెమిని టివి, మా టివి, ఈ టివి, దూరదర్శన్ వంటి పలు సంస్థలలో, అనేక సంగీత ఆధారిత కార్యక్రమాలు, ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించింది.

• ఆమె జెమిని టివిలో నవరాగం, ఈ టివిలో ఝుమ్మంది నాదం, సప్తస్వరాలు, పాడుతా తీయగా, అదేవిధంగా జీ సరిగమ లాంటి వివిధ సీరియల్ కార్యక్రమములకు ఒక నిర్వాహకురాలిగా, న్యాయమూర్తిగా అనేక రూపాలలో తన పాత్రను నిర్వహించింది.

• మా టివి నిర్వహించిన సూపర్ సింగర్ ప్రదర్శన యొక్క ఒక భాగం అయిన 4వ సిరీస్ కార్యక్రమమునకు ఆమె ఒక న్యాయమూర్తి, గురువుగాను వ్యవహరించింది.

సునీత గురించి మరింత తెలుసుకోవడానికి ఫాలో అవడానికి క్రింది లింక్లు కి వెళ్ళండి

FACEBOOK


TWITTER


INSTAGRAM


YOUTUBE


ఈ క్రింది వీడియోలలో ఆమె గురించి మరింత  తెలుసు కోండి


గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
























11, ఏప్రిల్ 2020, శనివారం

కొత్త యూట్యూబర్లకి వచ్చే ఇబ్బందులు ఏమిటి వాటిని ఎలా అధిగమించాలి

కొత్త యూట్యూబర్ల కి వచ్చే ఇబ్బందులు ఏమిటి వాటిని ఎలా అధిగమించాలి

తెలుగు యూ ట్యూబర్ గ్రూప్

YouTube యూట్యూబ్-

ఎంతో మందికి తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో విధాలా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే మన తెలుగులో కూడా ఎన్నో తెలుగు చానెల్స్ తమ టాలెంట్ నిరూపించుకోవడానికి రక రకాల చానెల్స్ ప్రారంభించి తమ తమ అభి రుచులకు అనుగుణంగా తమ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. చాల మంది నిరుద్యోగులకు ఇది జీవనాధారంగా కూడా చేసుకున్నారు. 

యూట్యూబ్ లో వీడియో లు అప్లోడ్ చేయడానికి  పెద్ద పెద్ద పరికరాలు ఉండక్కర్లలేదు . ఒక సెల్ ఫోన్ లేదా డిజిటల్ కెమెరా లేదా ఒక లాప్ టాప్  లేదా డెస్క్ టాప్ ఉంటె చాలు. ఎక్కువ వ్యూవర్స్ , సుబ్స్చ్రిబెర్స్ ఉన్న చానెల్స్ కి యాడ్సెన్స్ ద్వారా ఆఫ్ఫ్లియేషన్ మార్కెట్ ద్వారా వారికి ఆదాయం సమకూరుతుంది.

ఈ మధ్యకాలం లో యూట్యూబ్ తన నిబంధనలు మార్చి కఠిన తరం చేసింది. ఈ నిబంధనలు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి జీవనాదారం గా చేసుకోవాలని కొనే వారికీ ఒక శాపం గా మారిందనే చెప్పాలి.

ఒక సంవత్సరం లో 4000 గంటలు వ్యూస్ 1000 మంది సబ్ స్క్రైబర్స్ ఉంటేనే యూట్యూబ్ మోనిటైజేషన్ సాధ్యం కాదు. అప్పుడు గాని ప్రకటనలు రావు.

కొత్త యు ట్యూబర్స్  ఇప్పుడున్నంతగా ఒక్కప్పుడు లేరు. ఒక్కప్పుడు టీవీ.చానెల్స్ నడిపేవారికి,  యూట్యూబ్ లో  తమ ఛానల్ ఉండేది కాదు . ఇప్పుడు టీవీ చానెల్స్ వాళ్ళు తమ ఛానల్ ఒక పక్క నడిపిస్తునే  యూట్యూబ్ లో తమ లైవ్ టెలికాస్ట్ లు అప్లోడ్ చేసేస్తున్నారు. కార్పొరేట్ రంగం లో ఒకస్థాయికి ఎదిగి పోయిన వారికి యూట్యూబ్  ఇప్పుడు ఒక వరం గా మారింది . వాళ్ళ టీవీ ఛానల్ తో  బాటు యు ట్యూబ్ ఛానల్ కూడా వాళ్లే ఆక్ర మించేస్తున్నారు. కొత్తగా సినిమా నటులు నటీమణులు కమెడియన్లు సినిమాలు అవ కాశాలు లేనివారు ఇందులోకి వచ్చేసి అదనపు ఆదాయం గా దీన్ని మార్చేసు కుంటున్నారు.

ఇటు వంటి సమయంలో టీవీ ఛానల్, సినిమా టీవీ ఛానల్ నటీ నటీమణులు నుండి భారీఎత్తున చిన్న కొత్త యూట్యూబర్ భారీగా పోటీ ఎదుర్కోవలసి వస్తోంది. ప్రేక్షకులకు కూడా కొత్తదనాన్ని ఆహ్వానించే మనస్తత్వం ఇంకా అలవరుచుకొకపోవడం తో మూస పోత (రొటీన్ )తరహా యాంకర్స్,కమెడియన్ లనే ఇష్టపడుతున్నారు. ఒక ప్రేక్షకుడు తనో యు ట్యూబ్ ఛానల్ నడుపుతుండి కూడా ఒక కొత్త యూ ట్యూబర్ ను సబ్స్క్రయిబ్ చేసి ప్రోత్సహించాలనే మనస్తత్వం ఎక్కడ కనపడట్లేదు. అందువల్లే రిటైర్ అయినా న్యూస్ యాంకర్లు, జర్నలిస్టులు యూట్యూబ్ లో తమ ఛానల్ పెట్టుకొని కొంత వరకు నిల దొక్కుకుంటున్నారు .

  • సహజం గా కొంతమంది కొత్త యూట్యూబర్స్ అనుకుంటుంటారు. సుబ్స్చ్రిబెర్ ఎక్కువ ఉన్న ఛానల్ ను సబ్స్క్రయిబ్  చేస్తే తన కొత్త ఛానల్ కి వారి సుబ్స్చ్రిబెర్స్ వస్తారని కానీ ఆలా ఎన్నటికీ జరుగదు. 
  • సుబ్స్చ్రిబెర్స్ ఎక్కువగా ఉండిన వాళ్ళని సబ్స్క్రయిబ్ చేయడం వల్ల మీ కొత్త  ఛానల్కి సుబ్స్చ్రిబెర్స్ పెరగడము అనేది ఏమి జరుగదు. పైగా పుంఖాను పుంఖాలుగా వాళ్ళ వీడియోలు మీకు చూపిస్తుంటారు.  
  • ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వాళ్ళకి కూడా ఆదాయం వాళ్ళ వల్లే  ఎక్కువ వస్తుంది. వాళ్ళ  సుబ్స్క్రిప్షన్స్ బాగా ఎస్టాబ్లిష్ అయి ఉండడం వల్ల  మీ  కొత్త వీడియోలు ఎక్కువుగా ఆలిగోరితం కి అందవు. 
  • కొత్తవాళ్ళకి ఎంతమంది సుబ్స్చ్రిబెర్స్ ఉంటె అంతే వ్యూస్ వస్తాయి కాకపోతే వాళ్ళు మీమీద అభిమానం పెంచుకొని మీడియా ల లోకి షేర్ చేస్తే మీకు సబ్స్చ్రిబెర్స్ వ్యూస్ వస్తాయి .
  • అందువల్ల కొత్త చానెల్స్ ఎంత కాలం అయినా ఎదుగు బొదుగూ లేకుండా అలాగే ఉంటాయి .

 కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఏమి చెయ్యాలి.
  • కొత్త యూట్యూబ్ ఛానల్ తమకి సుబ్స్చ్రిబెర్స్ రావాలంటే  తమ తోటి  కొత్త చానెళ్లు ని సబ్స్క్రయిబ్ చేయండి. వారికీ మీరు సబ్స్క్రయిబ్ చేయగానే కృతజ్ఞతతో మీకు సబ్స్క్రయిబ్ చేస్తారు.

  • అలాగని మీకు నచ్చిన ఛానల్ సబ్స్క్రయిబ్ చేయవద్దని చెప్పట్లేదు. మీరు కూడా ఒక ఛానల్ రన్ చేస్తూ ఉంటే గనుక మీరు కొత్త సుబ్స్చ్రిబెర్లను  ఆశిస్తు ఉంటె గనుక  కొత్త చానెళ్లను ని ఎంకరేజ్ చేయండి .

  • మీ ఛానల్ లో వీడియో లను మీ పేస్బుక్, వాట్సఅప్ , ఇంస్టాగ్రామ్, ఇమెయిల్, వాట్స్ ఇంకా చాల ఉన్నాయ్ మీ మీ  మీడియా ల లో షేర్ చేయండి . వీటినే బ్యాక్ లింకులు అంటారు ఎన్ని బ్యాక్ లింకులు  పెంచుకుంటే అంత మంచిది.

  • మీ ఛానల్  లైక్,షేర్ అండ్ సబ్స్క్రయిబ్ చేయమని చెప్పండి . మీ ఛానల్ కి ఒక సుబ్స్చ్రిబెర్ బటన్ పెట్టుకోండి.

  • మీరొక పేస్ బుక్ పేజీ ఓపెన్ చేసుకొని దానిలోకి మీయొక్క కొత్త ఛానల్  యూట్యూబ్  వీడియోలు పోస్ట్ చేయండి .

  • ట్యూబ్ బడ్డీ క్రోమ్ ఎక్స్టెన్షన్  ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని వల్ల  టాగ్స్, ఎలా పెట్టాలో మీకు తెలుస్తోంది. 

  • సెర్చ్ ఇంజిన్లో పైకి రావాలంటే ఎక్కువ టాగ్స్ రిలవెంట్ గా మీ వీడియో కి తగినట్లు గా ఉండాలి . మీ టైటిల్ లో ఉన్న టాగ్స్ (పదాలు ) ప్రజలు ఎక్కువుగా సెర్చ్ చేస్తూ వుండేవై ఉండాలి. 

  • మీ యూట్యూబ్ టైటిల్ లో ఉన్న టాగ్స్ ఒక సారి  సెర్చ్ ఇంజిన్ లోకి  పై వరుస కి వస్తున్నాయో లేదో చెక్ చెయ్యండి .

  • అంతేకాకుండా మీ వీడియో చూడగానే ఆకట్టుకొనేలాగు ఉంటె ఎక్కువమంది వ్యూస్ సుబ్స్చ్రిబెర్లు  వెంటనే వస్తారు. 

  • మీరు చేసే తంబీ నైల్ , టైటిల్ ప్రేక్షకులు ఆకట్టుకొనేలా ఉండాలి.

  • నా ఫేస్బుక్ గ్రూప్ లో జాయిన్ అయి మీ కొత్త ఛానల్ వీడియో లు పోస్ట్ చేయండి. 

  • ఇప్పుడు  పేస్బుక్ లో యూట్యూబ్ ఛానల్ గ్రూఫులు  చాలానే ఉన్నాయి. కొన్ని లింక్లు ఇక్కడ ఇస్తాను. వీటి లోకి కొత్త యూట్యూబర్స్ తమ తమ వీడియోలు  పోస్ట్ చేసుకొని వ్యూస్, మరియు సుబ్స్చ్రిబెర్లను  పెంచుకోండి. 

  • ఒకరినొకరు అండర్స్టాండింగ్ తో యూట్యూబ్ నిబంధనలకు లోబడి  సబ్స్చ్రిబెర్లను వ్యూస్ పెంచుకో వచ్చు.   

క్రిందిన నా(Admin) ఫేస్బుక్ గ్రూప్  లింక్ ఉంది చూడండి  ఇదే ...

You tubers Association Universal



ఈక్రింది  ఫేస్బుక్ గ్రూప్  ల లో మెంబెర్ షిప్ కోసం రిక్వెస్ట్ పంపుకొని జాయిన్ కావచ్చు లింకులు   ఉన్నాయ్  చూడండి ఇవే... 

Telugu Youtubers

తెలుగు యూట్యూబ్ సబ్స్క్రయిబర్లు  (telugu youtube channels free subscribers)



Video,s and Youtube channel promotion (ENGLISH POSTING ONLY)


YouTube Permanent Subscribers 


Telugu Tub Today YouTube Channel


కొత్త యూ ట్యూబర్స్ రాణించాలంటే ఏమి చెయ్యాలి
  • కామెడీ బిట్టులతో ఒక షార్ట్ ఫిలిం తీయండి 

  • సందేశాత్మకంగా వీడియోలు తీయండి.

  • ఫామిలీ సెంటిమెంట్ ఇరుగు పొరుగు వారి తో చిట్ చాట్  

  • ఫ్రాంక్ వీడియో లు ఎక్కువు గా చూస్తున్నారు 

  • సోషల్ అవేర్నెస్ పై వీడియోలు తీయండి.

  • ఏనుగులు కోతులు చిలకలు ఫీట్లు సంబందించిన వీడియోలు

  • ప్రపంచమంతా మీ వీడియో లు గుర్తించాలంటే  ఇంగ్లీష్ లో వీడియోలు తీయండి 

  • ప్రాంతీయ భాష లో కనుక మీ వీడియో ఉంటె సబ్ టైటిల్స్ పెట్టుకోండి. యూట్యూబ్ స్టూడియో  లో  ఆప్షన్ ఉంది.

  • వివిధ ప్రాంతాల లో ఉండే  స్ట్రీట్ ఫుట్ గురించి వీడియోలు తీయండి 

  • వివిధ దేశాలలో ఉన్న అందమైన ప్రాంతాలు మీ కామెంటరీ తో వీడియో తీసి పెట్టండి

  • ఎడ్యుకేషన్, టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు గురించి చెప్పండి. దానికి రిలవెంట్ స్లయిడ్లు  లేదా ఉచితం గా లభించే లేదా మీ ఫోన్ షూట్ చేసిన  సంబందించిన  ఫ్యూటీజీ   వీడియోలు మిక్సింగ్  చేయండి.

  • వివిధ ప్రాంతాలలో ఉండే దేవాలయాలు వాటి  స్థల పురాణం గురించి చెప్పండి.

  • ప్రస్తుత కాలపు వార్తలు , విశేషాలు, వింతలూ,  ప్రముఖులతో ఇంటర్వ్యూలు, చర్చలు ఏర్పాటు చేయండి .

  • సాఫ్ట్వేర్ టీచింగ్,ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, కొటేషన్ లు సబందించి స్క్రీన్ రీడింగ్ చేసి వీడియో లు చెయ్యొచ్చు.

  • సాధ్యమైనన్ని ఎక్కువ వీడియోలు తీస్తుందండి  ఏదోఒక సమయం లో ఎదో ఒక వీడియో మీకు ఎక్కువ వ్యూస్ సుబ్స్చ్రిబెర్లు  మీకు తెచ్చి పెడుతుంది.

ముగింపు ఏమిటంటే రానున్న రోజులన్నీ కూడా కొత్త యూట్యూబర్ల దే తప్పని  సరి  రాజ్యం.
  • ఎందుకంటే మూసపోత (రొటీన్) యాంకరింగ్ నిల్చొని , కూర్చొని  టీవీ ఛానల్ లో లాగా చెప్పడం ప్రజలకి నచ్చటం లేదు.  ఆ వార్తకి సంబందించిన ప్రాంతం లో నిల్చొని లేదా న్యూస్ స్క్రోలింగ్ చేసుతూనో వీడియోలు చేసే వారిని ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు.

  • ఒక యూ ట్యూబర్స్ కి ఇంకొక యూ ట్యూబర్ కి వీడియో ప్రజెంటేషన్ లో చాల తేడా ఉంటుంది ప్రేక్షకులు అదే కోరుకొంటున్నారు .

  • కొత్త యూ ట్యూబర్లు   వివిధ ప్రాంతాలలో వీడియో లో తీస్తుంటారు అవి ప్రేక్షకులకు నచ్చుతాయి.

  • కొత్త యూ ట్యూబర్లు   కొత్త కొత్త ప్రాంతాలలో  కొత్త కొత్త యాంకరింగ్ పద్ధతులు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. వీడియోలు తీసే విధానం లోను, కథలు , పాటలు, శాస్త్రవిజ్ఞానం ఒకొక్కరి లో ఒక కొత్తదనం ఉండటం తో ప్రేక్షకులు క్రమేపి మూసపోత (రొటీన్) టీవీ ఛానళ్ళు, మూసపోత (రొటీన్) కథాచలన చిత్రాలకు త్వరలోనే గుడ్ బై  చెప్పే రోజులు  వస్తున్నాయనే  చెప్పాలి.

  • ఏది ఏమైనా యు ట్యూబ్ కొత్త యూట్యూబర్లకి  సంప్రదాయ వీడియో లు తీసేవారికి టెక్నికల్ , ఎడ్యుకేషనల్ వీడియోలు తీసే వారికీ కొంత సబ్స్క్రయిబర్ల  విషయంలో  కొంత వెసులు బాటు కల్పించి ప్రోత్సహము ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను.
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. లు చూసి  కొత్త YOU TUBERS తమ సుబ్స్చ్రిబెర్ లిస్ట్ ఎలా పెంచుకోవాలి తెలుసుకోండి 

Search Results




How To Get More Views And Subscribers On YouTube Using ...


ప్రసిద్ధి చెందిన టాప్  వీడియో యు. ఆర్. యల్ .లు చూసి  కొత్త యూట్యూబర్లు తమ వీడియోలు ఎలా ఉండాలో  తెలుసుకోండి.

తెలుగులో టాప్ :

టాప్ 10 తెలుగు యూట్యూబ్ చానల్స్ 2020 ఇవే ...


ENGLISH లో టాప్ :

Search Results


Top 25 Most Subscribed YouTubers to Follow in 2020 ...


Related website Link ...

Quote of the day:
"When obstacles arise, you change your direction to reach your goal, you do not change your decision to get there." -Zig Ziglar

NOTE:
నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి. 

నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like, share, కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  






పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...